Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bhola Shankar: చెల్లెలితో కలిసి మొదలెట్టిన చిరంజీవి.. అనుకున్నదానికంటే ముందే
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. ఆ తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమానూ చేశారు. ఆ వెంటనే బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించి.. ఈ మధ్యనే దాన్ని పూర్తి చేసేశారు. ఇది ఇంకా విడుదల కాకముందే మెగాస్టార్ చిరంజీవి మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాటినే ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ సీనియర్ హీరో తీరిక లేకుండా వరుసగా షూటింగ్‌లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు.
హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ
రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేశారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలనూ ఇప్పటికే మొదలు పెట్టేసిన ఆయన.. వీలైన సమయాన్ని కేటాయించి వాటిని చేస్తూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు చిరంజీవి చేస్తున్న చిత్రాల్లో 'భోళా శంకర్' మీదే అందరూ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఈ చిత్రాన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేశ్ రూపొందిస్తుండడమే.

'భోళా శంకర్' సిస్టర్ సెంటిమెంట్‌తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా నవంబర్‌లో దీన్ని మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఎంతో వేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఓ మాంచి సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు.
మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ
తాజా సమాచారం ప్రకారం.. 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు మహానటి కీర్తి సురేష్ కూడా భాగం అయినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులకు పైగా ఈ షెడ్యూల్ జరగబోతుందని అంటున్నారు. ఇది మొత్తం వీళ్లిద్దరి మధ్య జరిగే సన్నివేశాలతో పాటు ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న తమన్నా సీన్స్‌తో కూడి ఉంటుందని తెలిసింది. అయితే, ఆమె మాత్రం కొద్ది రోజుల్లో చిత్ర యూనిట్‌తో జాయిన్ అవుతుందట. ఇక, ఈ స్పీడు చూస్తుంటే 'భోళా శంకర్' అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యేలా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారట. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.