Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదే పొగరు, అదే ఫిగరు.. అప్పట్లో ఎదురెదురు ఇంట్లో.. విజయశాంతిపై చిరంజీవి హాట్ కామెంట్స్
నిన్న (జనవరి 5) 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు మెగా అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చాయి. వేదికపై విజయశాంతిని అలా చూస్తూ ఘాటుగా, మోటుగా ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాలను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు చిరు. వివరాల్లోకి పోతే...

ఒకే వేదికపై విజయశాంతి, చిరంజీవి
'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతి, చిరంజీవి ఒకే వేదికపై చేరి మెగా, సూపర్ స్టార్ అభిమానుల చేత ఈలలు వేయిస్తూ కేకలు పెట్టించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే వేదికపైకి చేరడం చూపరులను ఆకట్టుకుంది. ఇక విజయశాంతిపై చిరంజీవి చేసిన కామెంట్స్ అయితే మరింత ఆసక్తికరంగా మారాయి.

తన హీరోయిన్ విజయశాంతి అంటూ గర్వంగా..
విజయశాంతిని చూస్తూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిన చిరంజీవి.. వాళ్ల రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. విజయశాంతి తన హీరోయిన్ అని చెప్పారు. అంతేకాదు తనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించందని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు గెలుచుకున్న నటి విజయశాంతి అని గర్వంగా చెప్పుకొచ్చారు.

అప్పట్లో టీ నగర్‌లో.. ఎదురెదురు ఇంట్లో ఇద్దరం
ఈరోజు సండే.. నాతో ఆరోజు ‘సండే అననురా.. మండే అననురా ఎన్నడు నీదాన్నిరా' అని అప్పట్లో నాకు మాట ఇచ్చిన నా మనిషి నా బ్లాక్‌బస్టర్స్ హిట్ పెయిర్ విజయశాంతి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అప్పట్లో టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగానే విజయశాంతి ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే.. మా ఇంటికి తను వచ్చేది, తన ఇంటికి నేను వెళ్లేవాడినని చెబుతూ తమ సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు చిరు.

అలా ఎలా తిట్టావు విజయశాంతి అంటూ హత్తుకున్న చిరు
ఇక అప్పట్లో విజయశాంతి తనను తిట్టిన విషయాన్ని గుర్తు చేసిన చిరు.. ఫన్నీగా
ఆమెను కామెంట్ చేస్తూ మనసులో మాట బయటపెట్టడం ఆసక్తికర అంశం. ''నన్ను అలా ఎలా తిట్టావు విజయశాంతి.. నీకు మనసెలా వచ్చింది'' అంటూ చిరంజీవి మాట్లాడిన విధానం, ఆమెను ఆప్యాయంగా హత్తుకోవడం అనీ ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

చేయి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో! విజయశాంతి రియాక్షన్
నాకు నీ మీద కోపం.. నా కంటే ముందే పాలిటిక్స్ లోకి వెళ్ళావు, పైగా నన్ను తిట్టావు. ఇప్పుడు కూడా అదే పొగరు, అదే ఫిగరు.. అని చిరు అనగా, వెంటనే చిరంజీవి చేతిలో నుండి మైక్ లాక్కున్న విజయశాంతి.. ''పంచ్ డైలాగ్ వేశారు.. చేయి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో రఫ్ ఆడిస్తా.. రాజకీయం వేరే సినిమా వేరు.. మీరు నా హీరో.. నేను మీ హీరోయిన్'' అనేసింది. ఇద్దరం కలిసి 20పైగా సినిమాలు చేశాం. మళ్లీ ఇప్పుడు కూడా చేద్దామా.. అంటూ విజయశాంతి రియాక్ట్ అయింది.