47 ఏళ్లలో అనుక్షణం అదే చూశా.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్
పద్మవిభూషణ్, మెగాస్టార్, డాక్టర్ కొణిదెల చిరంజీవి తాజాగా మెగా అభిమానులతో, తెలుగు ప్రేక్షకులతో ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ప్రారంభం నాటి రోజులను గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదురున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏకంగా ఫిల్మ్ మేకింగ్ లోనే ఎన్నో మార్పులు రావడం కూడా ప్రారంభం అయ్యాయి. ఇలా మెగాస్టార్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
కాగా, సెప్టెంబర్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. సరిగ్గా నాలుగు దశాబ్దాల కింద మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెండితెరపై మెరిసిన రోజు. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ కు తెలుగు ప్రేక్షకులు కరతాల ధన్వులు, కేకలతో తమ హృదయాల్లోకి చిరంజీవిని ఆహ్వానించిన రోజు. అయితే ఈ ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ నోట్ ను విడుదల చేశారు. తన నట జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గురించి అభిమానులతో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా ఎక్స్ వేదికన మెగాస్టార్ చిరంజీవి ఇలా స్పందించారు. '22 సెప్టెంబర్ 1978. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు అనే చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి, నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను. అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమ మాత్రమే. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి మాత్రమే. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.' అంటూ థ్యాంక్ యూ నోట్ విడుదల చేశారు. దీంతో పాటు మెగాస్టార్ తొలిచిత్రం ప్రాణం ఖరీదు పోస్టర్ ను కూడా పంచుకున్నారు. ప్రాణం ఖరీదు చిత్రానికి కే వాసు దర్శకత్వం వహించారు. రావు గోపాల్ రావు, జయ సుధ, చంద్ర మోహన్, కైకాల సత్యానారాయణ నూతన్ ప్రసాద్, రమ ప్రభ కీలక పాత్రల్లో నటించారు. కే చక్రవర్తి సంగీతం అందించారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ 70వ ఏట అడుగు పెట్టారు. ఏడు పదుల వయస్సులోనూ ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్.. పండగకి వస్తున్నారు, మల్దిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెల, బాబీ కొల్లి దర్శకత్వంలోనూ నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











