For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేఖ అడుగుపెట్టగానే సభ ఒక్కసారిగా షాక్.. సురేఖను అందుకే అలా పిలుస్తా..నాగ్ వీడియో డిలీట్ చేయి

  |
  ANR National Awards 2019 : Mega Star Chiranjeevi Great speech @ ANR National Awards Function

  హైదరాబాద్‌లో నవంబర్ 17న జరిగిన ANR నేషనల్ అవార్డ్స్‌ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఈ అవార్డుల ఫంక్షన్‌కి టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా అవార్డు విజేతలకు అవార్డులు అందజేయడం జరిగింది.

  రేఖపై నాగ్ ఆసక్తికర కామెంట్స్

  రేఖపై నాగ్ ఆసక్తికర కామెంట్స్

  ఈ సందర్బంగా వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. శ్రీదేవి, రేఖలతో తనకున్న అనుబంధం గురించి వివరించారు నాగ్. ఈ అవార్డు శ్రీదేవి, రేఖలకు ఇవ్వాలనేది ఏఎన్నార్ కోరిక అని అన్నారు. శ్రీదేవితో తాను నాలుగు సినిమాలు చేశానని, ఆమె ఓ దేవత అని చెప్పారు. శ్రీదేవి అకాల మరణం తీరని లోటు అన్నారు. నటి రేఖ గురించి మాట్లాడుతూ.. అన్నిరకాల సినిమాలు ఎలా చేశారు, ఎలా అంత సక్సెస్ రేట్‌ను సాధించారో తెలపాలని కోరారు. అలాగే ఆమె అందానికి గల సీక్రెట్ ఏమిటో కూడా అందరికీ తెలియజేయాలని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగ్.

  అద్భుతంగా సాగిన చిరు ప్రసంగం

  అద్భుతంగా సాగిన చిరు ప్రసంగం

  ANR అవార్డ్స్ కార్యక్రమంలో తన చేతుల మీదుగా రేఖకు అవార్డు అందించిన చిరు.. వేదికపై కాసేపు మాట్లాడారు. ఒక చిన్న కథతో ప్రారంభమైన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన చెప్పిన సంగతులు విని ఆశ్చర్యపోయారు అక్కడున్న సినీ ప్రముఖులు.

  అమ్మ కథ చెప్పి ఆశ్చర్యపరిచిన చిరు..

  అమ్మ కథ చెప్పి ఆశ్చర్యపరిచిన చిరు..

  అదొక పల్లెటూరు. కొత్తగా పెళ్లయిన జంట. ఆమె నిండు గర్భవతి. రేపో మాపో డెలివరీ అయ్యే సమయం. అదే సమయంలో తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. పక్కనున్న టౌన్‌కు వెళ్లి సినిమా చూడాలి. బిడ్డకు జన్మనిచ్చిన తరవాత సినిమా చూసే అవకాశం ఉండదు. ఈ కోరికను తన భర్తకు చెప్పుకుంది. ఈ సమయంలో ఎలా వెళ్తావు అన్నాడు భర్త. ఎలాగైనా వెళ్లాలి అంది. గర్భంతో ఉన్న భార్య కోరిక తీరుద్దామని ఆ భర్త సరే అన్నాడు. జట్కా బండిలో సినిమాకు బయల్దేరారు అంటూ తన తల్లిదండ్రుల గురించి చెప్పిన కథ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  రేఖ రావడంతో రాజ్యసభ వాయిదా..

  రేఖ రావడంతో రాజ్యసభ వాయిదా..

  తాను రాజ్యసభలో ఉన్న సమయంలో.. ఒకరోజు అందరూ వాగ్వాదం చేసుకుంటూ ఉండటంతో గందరగోళంగా మారిందని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో రేఖ రావడంతో అందరూ సైలెంట్ అయిపోయి .. పొద్దు తిరుగుడు పువ్వులా ఆమెనే చూస్తూ ఉండిపోయారని తెలిపాడు. రేఖ రావడంతో ఆ రోజు రాజ్యసభ వాయిదా పడిపోయిందని, అందుకే ఆమె అప్పుడప్పుడు మాత్రమే వచ్చేదని పేర్కొన్నాడు. ఆమె వస్తే.. దేశ సమస్యల గురించి మాట్లాడకుండా.. అందరూ ఆమె వైపే చూస్తుండిపోతారని ఆమెకు కూడా తెలుసంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో రేఖ వేదికపైనే సిగ్గుపడిపోయి నవ్వింది.

   నా భార్యను అందుకే అలా పిలుస్తా..

  నా భార్యను అందుకే అలా పిలుస్తా..

  తనకు రేఖ అంటే ఎంత ఇష్టమో చెప్పలేనని, తన అదృష్టమో ఏమే కానీ సురేఖ అనే పేరున్న భార్య దొరికింది.. తనను అందరూ సురేఖ అని పిలుస్తూ ఉంటే.. తాను మాత్రం రేఖ అని పిలిచేవాడినని తెలిపాడు. నేను ఈ రేఖను ఉద్దేశించి పిలుస్తానని, ఇప్పటి వరకు తన భార్యకు ఆ విషయం తెలీదని, ఒకవేళ ఈ వీడియోను చూస్తే తెలిసిపోతుందని, ఎడిట్ చేయించమని నాగ్‌తో ఫన్నీగా చెప్పేశాడు.

  English summary
  Chiranjeevi Emotional And Most Entertaining Speech AT ANR National Award Event. Chiranjeevi Funny Comments On Rekha While They Are At Rajya Sabha. He Revealed Secret Behid His Wife Surekha's Pet Name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X