మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరు.. క్యారావన్ డ్రైవర్ కుటుంబానికి అండగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ కి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు దాసరి ఎలా అయితే తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు తీరుస్తూ టాలీవుడ్ పెద్దదిక్కుగా ఉన్నారో ఇప్పుడూ అలాగే చిరంజీవి కూడా అన్ని సమస్యలు తీరుస్తూ సాయం అడిగిన వారికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన సిసిసి పేరుతో ఒక ఫండ్ రైజింగ్ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సినీ కార్మికులకు అండగా నిలిచారు.

లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న అనేక వందల మంది కార్మికులకు ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు సైతం పంపిణీ చేశారు. అలాగే టాలీవుడ్ లో సైతం ఎవరూ ఇబ్బందుల్లో ఉన్నా చిరంజీవి అండగా నిలిస్తున్నారు. గతంలో అల్లరి సుభాషిణి అలాగే పావలా శ్యామల లాంటి వాళ్లకు ఆయన సాయం అందించారు. మరోసారి పావలా శ్యామల కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకుని ఆయన మా మెంబర్షిప్ కార్డు అందేలా 115000 రూపాయల పంపించారు.. ఇక తాజాగా తన దగ్గర క్యారవాన్ డ్రైవర్ గా పనిచేస్తూ కరోనా కారణంగా మృతి చెందిన జయరామ్ కుటుంబానికి కూడా ఆయన అండగా నిలిచారు.

Chiranjeevi helps late caravan drivers family

చిరంజీవి కారం క్యారవాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న జయరామ్ ఈ మధ్యనే కరోనా సోకి కన్నుమూశారు. జయరామ్ కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. జయరామ్ కుటుంబం ఆర్థికపరమైన కష్టాల్లో ఉందని తెలుసుకున్న చిరంజీవి వారికి తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. లక్ష రూపాయలకు సంబంధించిన చెక్ జయరామ్ కుటుంబ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అందుకుంది. ఇక మరోపక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక ఆక్సిజన్ బ్యాంకు లాంటిది ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X