For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానులకు పండుగ చేసుకునే న్యూస్: కొత్తది మొదలు పెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి

  |

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకుని కొన్నేళ్ల క్రితమే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు.

  Netrikann First Review: నయనతార నటవిశ్వరూపం.. నెట్రికన్ మూవీ హైలైట్స్ ఇవే.. క్లైమాక్స్ మాత్రం!

  ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. రెండు పాటలు మినహా దీనికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తన 153వ చిత్రంగా రాబోతున్న కొత్త ప్రాజెక్టు 'లూసీఫర్' రీమేక్‌ను తాజాగా పట్టాలెక్కించేశారు.

  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. దీన్ని కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించబోతున్నారు. ఇక, ఈరోజు (ఆగస్టు 13) లూసీఫర్ రీమేక్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Chiranjeevi Lucifer Remake Shooting Started

  'లూసీఫర్' రీమేక్ కోసం హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అందులోనే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ చిత్రీకరణ జరగబోతుంది. ఆ తర్వాత మిగిలిన షెడ్యూల్‌లను మొదలు పెడతారు. ఇక, తాజా షెడ్యూల్‌లో మాత్రం హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్లను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే, మిగిలిన నటీనటులతో కీలకమైన సీన్స్‌ను షూట్ చేయనున్నారట. వీటితో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఆరంభంలోనే చిత్రీకరిస్తారని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

  పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌లో చక్రం తిప్పే ఓ డాన్‌గా నటిస్తున్నారు. ఆయనకు చెల్లెలిగా ఓ హీరోయిన్ నటించాల్సి ఉంది. ఆమె ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కూడా క్రియేట్ చేశారు. దానికి ఎవరిని తీసుకుంటారో తెలియలేదు. ఇక, ఈ చిత్రాన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోకు సహకరించే డాన్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు ఈ మధ్య ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi Will do ‘Lucifer’ Remake Under Mohan Raja Direction. This Movie Shooting Stated From Today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X