twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather ఉపాసన కొణిదెల పొలిటికల్ ఎంట్రీపై చిరంజీవి క్లారిటి.. ఆ విషయంలో నా హిస్టరీని చూసుకో..

    |

    ప్రతీ కథకు ఒక ఆత్మ ఉంటుంది. దానికి ఎవరైనా కనెక్ట్ అయితే.. సీన్లు, పాటలకు, ఇతర అంశాలకు కనెక్ట్ కాకూడదు. అలా చేయకుండా ఉంటే సినిమా భవిష్యత్ ఏమిటో మనకు తెలిసిపోతుంది. లూసిఫర్ సినిమా విషయానికి వస్తే.. రీమేక్ అయినా ఆ సినిమాలోని సోల్‌ను పట్టుకొని చేశాం. నేను రీమేక్ సినిమాలో సన్నివేశాలు, పాత్రలను నేను ఎప్పుడూ ఫాలో కాను. గాడ్‌ఫాదర్ సినిమా రీమేక్ విషయంలో మీకు లూసిఫర్‌ను మళ్లీ చూసినట్టు ఉండదు అని చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్‌ఫాదర్ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్వహించిన మీడియా ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ..

    రాజకీయాలపై సెటైర్ల గురించి

    రాజకీయాలపై సెటైర్ల గురించి


    గాడ్‌ఫాదర్ సినిమాలో రాజకీయాలపై సెటైర్లు ప్రత్యేకంగా వేయలేదు. ఆ సినిమాలో కథకు అనుగుణంగానే ఫాలో అయ్యాం. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులకు దగ్గరగా ఉండేలా ప్రయత్నించాం. డైలాగ్స్ విషయంలో నా జోక్యం ఏమీ లేదు. దర్శకుడు, మాటల రచయిత లక్ష్మీభూపాల తీసుకొన్న నిర్ణయం. ఒకవేళ ఈ సినిమాలోని డైలాగ్స్ చూసి ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను అని చిరంజీవి అన్నారు.

     ఊహాగానాలుపై స్పందించిన చిరు

    ఊహాగానాలుపై స్పందించిన చిరు


    నేను రాజకీయాల్లోకి వస్తాననే ఊహాగానాలు వస్తున్నాయి. జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తానని, వైఎస్ఆర్ సీపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నాననే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణలో మల్కాజిగిరి నుంచి మా కోడలు ఉపాసన పోటీచేస్తారనే ఊహగానాలు రావడంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో నాకు తెలియదు. వారు సినిమా పరిశ్రమలోకి వస్తే మంచి కథలు వస్తాయి అని చిరంజీవి సెటైర్ వేశారు.

     మలయాళంలో రిలీజ్ గురించి

    మలయాళంలో రిలీజ్ గురించి


    గాడ్‌ఫాదర్ సినిమాను మలయాళంలో రిలీజ్ చేయడం లేదు. మలయాళం నుంచి రీమేక్ చేసినందు వల్ల వద్దని అనుకొన్నాం. అయితే మలయాళంలో రిలీజ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒక ఫ్యాన్ పోస్టర్ కారణంగా గందరగోళం నెలకొన్నది. ఎవరో అభిమాని చేసిన పోస్టర్ భారీగా వైరల్ కావడంతో ఇలాంటి ప్రశ్నలు మా వద్దకు వచ్చాయి. కానీ రెండు వారాల తర్వాత తమిళంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని చిరంజీవి తెలిపారు.

    రీమేక్‌లపై తక్కువ భావన వద్దు

    రీమేక్‌లపై తక్కువ భావన వద్దు


    రీమేక్ సినిమాలపై చిన్నచూపు చూడకూడదు. తక్కువ భావన ఉండకూడదు. ఒరిజినల్ సబ్జెక్ట్ కంటే రీమేక్ చేయడం అతి పెద్ద సవాల్. కంపరేటివ్ స్టడీలో నిలబడగలమా? లేదా అనే ఛాలెంజ్. నేను రీమేక్ చేసిన సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రికార్డులు ఉన్నాయి. కాంపరిజన్‌లో నేను టాప్ అనే విషయం నా హిస్టరీ చెబుతున్నది. రీమేక్ సినిమాల్లో నటించిన నేపథ్యంలో ఎక్కువ ప్రశంసలు అందుకొన్నాను అని చిరంజీవి చెప్పారు.

    గాడ్‌ఫాదర్ ప్రభావం లేదు

    గాడ్‌ఫాదర్ ప్రభావం లేదు


    ప్రపంచ సినిమాను ప్రభావం చూపిన హాలీవుడ్ చిత్రం గాడ్‌ఫాదర్ సినిమా ప్రభావం మా సినిమాపై లేదు. లెజెండరీ సినిమాను నేను ఎప్పుడో చూశాను. మళ్లీ చూడలేదు. ఆ సినిమాను ముట్టుకునే సాహసం చేయలేదు. నా గెటప్ విషయంలో కూడా ఆ గాడ్‌ఫాదర్ సినిమాను ఫాలో కాలేదు అని చిరంజీవి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    English summary
    Megastar Chiranjeevi's GodFather is coming on October 5th. Here is the Chiranjeevi's answer to few media questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X