Chiranjeevi: చిరంజీవి ట్రిపుల్ ట్రీట్.. ఇక మెగా ఫ్యాన్స్‌కి నాన్‌స్టాప్ ఫెస్ట్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెబితే.. ఫ్యాన్స్ లో ఓ కొత్త జోష్ వస్తుంది. అలాంటిది చిరు సినిమా వస్తుందంటే.. ఇక ఫ్యాన్స్ కు పండుగనే. ఒక సినిమా వస్తేనే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయంటే.. ఇక చిరు ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటీ? ఎప్పుడు విడుదల కాబోతున్నాయి. ఓ లూక్కేయండి.
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్. ఆ తరువాత భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాల ఎంపికలో చిరంజీవి ఆచి తూచి అడుగులు వేయటం స్టార్ట్ చేశారు. 'విశ్వంభర' సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఔట్ పుట్ విషయంలో శాటిస్పాక్షన్ లేకపోవటంతో సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కి వాయిదా వేసేశారంట. ఈ విరామం దాదాపు రెండేళ్లకు చేరుకుంది. దీంతో ఫ్యాన్స్ చాలా కాలంగా "మెగాస్టార్ ఎప్పుడు వస్తారు?" అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ, చిరంజీవి ఇప్పుడు ఒకే ఏడాది మూడు భారీ సినిమాలతో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

'మన శంకర వరప్రసాద్ గారు'
ప్రస్తుతం చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" అనే సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లలో నిపుణుడు అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 2026 సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. చిరంజీవి కెరీర్‌లో ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ రివీల్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది.
'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు కలిసి తెరపై కనిపించబోతున్నారనే వార్త ఒక్కటే సినిమా మీద హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది. అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా చిరంజీవి మాస్ ఇమేజ్‌కు కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ కలయికతో పక్కా కమర్షియల్ ప్యాకేజ్‌గా ఈ సినిమా రాబోతుందని యూనిట్ సర్కిల్స్ చెబుతున్నాయి.
'విశ్వంభర'
చిరంజీవి ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ "విశ్వంభర". ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ విజువల్స్, శక్తివంతమైన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల కొంత ఆలస్యం అవుతోంది. మొదట ఈ సంవత్సరం సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు 2026 సమ్మర్ రిలీజ్‌గా మారింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి-త్రిష జంట చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌కి ఇది మరో మెగా సర్‌ప్రైజ్‌గా మారింది. విశ్వంభర సినిమాతో చిరంజీవి కొత్త జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ఆడియన్స్‌ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని సమాచారం. భారీ సెట్‌లు, అద్భుతమైన సీజీ వర్క్, చైతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలువబోతున్నాయి.
చిరంజీవి - బాబీ కాంబో బ్లాస్ట్
"వాల్తేరు వీరయ్య"తో చిరంజీవికి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లీ మరోసారి మెగాస్టార్‌తో చేతులు కలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ఆగస్టులో చిరంజీవి బర్త్‌డే సందర్భంగా అధికారికంగా ప్రకటించబడింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి గొడ్డలిని పట్టుకున్న లుక్‌తో కనిపించడం ఫ్యాన్స్‌కు సూపర్ హైప్ ఇచ్చింది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని బాబీ టీమ్ చెబుతోంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల చేయాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. బాబీ ఈ ప్రాజెక్ట్‌ను డాకు మహారాజ్ తరహాలో పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారని టాక్. చిరంజీవి ఈ సినిమాతో తన యాక్షన్ ఇమేజ్‌ను మరోసారి కొత్త లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నారు.
మెగా ఫ్యాన్స్‌కి ట్రిపుల్ పండగ
'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి విడుదల కాబోతుండగా, 'విశ్వంభర' సమ్మర్ ట్రీట్ రాబోతుందట. ఇక బాబీ సినిమా దసరా లేదా డిసెంబర్ రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇలా 2026 మొత్తం మెగాస్టార్ సినిమాలే డామినేట్ చేయనున్నాయి. ఒక ఏడాదిలో మూడు సినిమాలు విడుదల కావడం చిరంజీవి కెరీర్‌లో చాలా అరుదు. అలాగే.. ప్రతి సినిమా వేరే జానర్‌లో, వేరే ఫ్లేవర్‌లో రాబోతుండటంతో ఫ్యాన్స్‌కి ఇది నిజమైన "ట్రిపుల్ ఫీస్ట్" అవుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామా, ఫాంటసీ అడ్వెంచర్, మాస్ యాక్షన్ అన్నీ ఒకే ఏడాదిలో చూడబోతున్నారు మెగా అభిమానులు. ఒక మాటలో చెప్పాలంటే.. "2026 అంటే చిరంజీవి ఇయర్ రే!".


Click it and Unblock the Notifications











