Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ హాట్‌గా అడల్డ్ కామెడీ.. 7న చితక్కొట్టుడు 2 రిలీజ్.. తమిళంలో సూపర్ రెస్పాన్స్‌తో
తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ దూసుకెళ్లిన చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రానికి సీక్వెల్ సిద్దమైంది. చితక్కొట్టుడు 2 టైటిల్‌తో ఈ చిత్రం జనవరి 7న థియేటర్ రిలీజ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి వెర్షన్‌కు నటించి దర్శకత్వం వహించిన సంతోష్ పీ జయకుమార్ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించడం గమనార్హం.
ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ హరి భాస్కర్ నిర్మించిన చితక్కొట్టుడు చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. టీజర్లు, ట్రైలర్లకు విశేషమైన స్పందన లభించడంతో ఈ ప్రాజెక్టు క్రేజీగా మారింది. ఇప్పటికే ఇరత్తు అరాయిల్ మురట్టు కుతు అనే టైటిల్‌తో రిలీజై తమిళనాడులో మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది.

తెలుగులో జనవరి 7వ తేదీన చితక్కొట్టుడు 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు, కథనాయకుడు సంతోష్ పి జయకుమార్ మాట్లాడుతూ " ఇప్పటివరకు వచ్చిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మొదటి వెర్షన్‌కు మించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఉంటుంది. లాక్‌డౌన్ తరువాత దీపావళికి తమిళనాట విడుదలైన తొలి చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు మాత్రమే. ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకి కనువిందు చేసే చిత్రం ఇది. " అని తెలిపారు.

నటీనటులు: సంతోష్ పి జయకుమార్, మీనల్, కరీష్మా, ఆకృతి సింగ్, రవి మారియ, ఛామ్స్, డానీ, టీఎస్కే, షల్లు షాము, లొల్లు షబా మనోహర్, లొల్లు షబా స్వామీనాథన్, సింగమ్ పులి.
దర్శకుడు: సంతోష్ పి. జయకుమార్
నిర్మాత: ఎస్. హరి భాస్కరన్.
సంగీతం: ఎస్.ఎన్. ప్రసాద్, ధరన్ కుమార్.
సినిమాటోగ్రఫీ: బల్లు
ఎడిటర్: ప్రసన్న జి. కె.
బ్యానర్: ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్