For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘టక్ జగదీష్’ విడుదలపై మరో న్యూస్: ఓటీటీ డీల్ గురించి బయటకొచ్చిన ఊహించని వార్త

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంలోనే వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు. మూవీ మూవీకి వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్నో సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

  Bheemla Nayak First Glimpse: పవన్ కల్యాణ్ ఊరమాస్ అవతారం.. భీమ్లా నాయక్ టీజర్‌ హైలైట్స్ ఇవే

  నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ క్రమంలోనే దీన్ని గత ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇక, ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడంతో ఈ సినిమా విడుదలపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

  Clarity about Nanis Tuck Jagadish Amazon Prime Release

  'టక్ జగదీష్' మూవీని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందని.. ఈ నేపథ్యంలో దీన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడం.. ఈ మధ్య విడుదలైన చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంతో.. 'టక్ జగదీష్' యూనిట్ ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక నాని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  తాజా సమాచారం ప్రకారం.. 'టక్ జగదీష్' మూవీని ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలో హీరో నాని అసంతృప్తిగా ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఇందులో వెనక్కి తగ్గడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

  Clarity about Nanis Tuck Jagadish Amazon Prime Release

  ఎంతో ప్రతిష్టాత్మకంగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడు పోయాయి. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

  English summary
  Natural Star Nani, Ritu Varma and Aishwarya Rajesh Doing Tuck Jagadish Movie Under Shiva Nirvana Direction. Now Clarity about This Movie OTT Release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X