For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కత్తి మరణం వెనుక ఏదో ఉంది.. తల తీసుకుపోతారు అనేవాడు.. డ్రైవర్ గురించి పృధ్వీ సంచలనం?

  |

  సినీ పాత్రికేయుడు గా కెరీర్ ప్రారంభించిన కత్తి మహేష్ ఆ తర్వాత సినిమా నటుడిగా, దర్శకుడిగా మారి సినిమా రంగానికి తన సేవలను అందించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన విజయవాడ నుంచి చిత్తూరు వెళ్తున్న క్రమంలో నెల్లూరు దగ్గర్లో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదం విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని సినీ నటుడు పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  కత్తి మహేష్ మరణం

  కత్తి మహేష్ మరణం

  30 ఇయర్స్ పృథ్వీరాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్. అలాగే వివాదాస్పద రాజకీయ నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. నిజానికి గత ఎన్నికల కంటే ముందే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కి మద్దతు తెలిపి, వైఎస్ జగన్ పార్టీలో కూడా చేరారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం కూడా నిర్వహించి వైసీపీకి బలమైన గొంతు అనిపించుకున్నారు అని చెప్పక తప్పదు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ కు హాజరు కాగా ఆ ఇంటర్వ్యూ లో కత్తి మహేష్ మరణం గురించి ఇంటర్వ్యూ చేసే యాంకర్ ప్రస్తావించారు. దీంతో ఈ విషయం గురించి స్పందించిన పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  తల తీసుకుని వెళ్ళిపోతారు

  తల తీసుకుని వెళ్ళిపోతారు

  ఇక తాము ఇద్దరం కలిసి కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారం చేశామని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మా మధ్య మంచి స్నేహ బంధం లాంటిది ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అయితే తనకు కత్తి మహేష్ ప్రచారంలో చాలా హెల్ప్ చేశాడని అలాగే కత్తి మహేష్ బాగా చదువుకోవడం తో కొన్ని మంచి మంచి పాయింట్లు కూడా చెప్పి తాను ప్రెస్ మీట్ లో బాగా మాట్లాడడానికి సహాయం చేశాడు అని వెల్లడించారు. అయితే కత్తి మహేష్ ఆయన ఎంచుకున్న దాని మీద బలంగా నిలబడే వారు అని ఆయన వెల్లడించారు. మీ మీద ఇంతగా ట్రోలింగ్ జరుగుతోంది కదా, వివాదాలు ఉన్నాయి కదా ఎందుకు అలా ఉంటారు అంటే మనం యుద్ధం చేస్తున్నాం, యుద్ధం చేసే వాడు కత్తి పట్టుకుని ఉండాలి కానీ సైలెంట్గా చెట్టు కింద కూర్చుంటే అవతలి వాళ్ళు వచ్చి మన తల తీసుకుని వెళ్ళిపోతారు అందుకే నేను ఎప్పుడూ సైలెంట్గా ఉండను అని ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని చెప్పేవాడని వెల్లడించారు.

  అనుమానాస్పదంగా

  అనుమానాస్పదంగా

  తనకు తెలిసినంత వరకు కత్తి మహేష్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు, ఆయన సంపాదించుకున్న ఆస్తి ఏమీ లేదని ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా మంది ట్రోల్ చేసిన విధానం తనకు బాధ కలిగించిందని పృథ్వి వెల్లడించారు. ఆయనకు భార్య ఒక బాబు కూడా ఉన్నాడు అని వెల్లడించారు. అయితే చివరి నిమిషంలో డబ్బు గురించి ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేసినా సరే ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేసి బాధ పెట్టారు అని వెల్లడించారు. అలాగే కత్తి మహేష్ మరణం విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని ఎందుకంటే కత్తి మహేష్ చనిపోగా కారు తోలుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకపోవడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఎందుకంటే కారు ఢీకొని ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయనకు చిన్న దెబ్బ కూడా తగలలేదు అని వెల్లడించారు.

  పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే

  పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే

  అందుకనే తనకు అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు అలాగే తాను కనుక ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే కచ్చితంగా ఈ కేసు టేకప్ చేసి అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి అనే విషయం కనిపెట్టి వాడిని అని అన్నారు, అయితే ఇప్పటికే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఈ కేసులో పూర్వాపరాలు పరిశీలించాలని డిమాండ్ చేశారని అది ఎంతవరకు అవుతుంది అనేది వేచి చూడాలని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. నిజానికి పృథ్వీరాజ్ కూడా గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే క్రమంలో తనకు మోరల్ సపోర్ట్ గా నిలిచింది కత్తి మహేష్ అని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ సమయంలో ఎవరు ఫోన్ చేయని టైంలో కూడా కత్తి మహేష్ ఫోన్ చేసి తనకు అండగా నిలబడ్డాడు అని నిజంగా ఒక స్నేహితుడిని కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

  Recommended Video

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  ఆ భగవంతుడికే తెలియాలి

  ఆ భగవంతుడికే తెలియాలి

  ఇక కత్తి మహేష్ రెండు మూడు పార్టీలకు టార్గెట్ గా ఉండేవాడని ఏమైందో ఆ భగవంతుడికే తెలియాలి అని అన్నారు. అలాగే కత్తి మహేష్ జీవితంలో ఏమీ సంపాదించుకోలేదు అని ఇప్పుడిప్పుడే కాస్త సెటిల్ అవుతున్నాడు అనుకుంటే భగవంతుడు దూరం చేసాడు అని అన్నారు. ఆయన ఓ టి టి కి ఒక సినిమా చేస్తున్నానని మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా అని తనతో అన్నారని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్. అలాగే ప్రస్తుతం పరిస్థితులు సినిమాలకు అనుకూలంగా ఉన్నాయని హీరో దొరక్కపోతే ఇప్పుడు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేసే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద పృథ్వీరాజ్ కత్తి మహేష్ మరణం గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
  English summary
  Movie star Prithviraj Raj has made sensational remarks that he has doubts about the Katti Mahesh road accident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X