For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa First Song: ఇది కదరా ఆకలి అంటే.. అల్లు అర్జున్ విశ్వరూపం.. బాక్సాఫీస్ పీక తెగినట్లే!

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరొక స్థాయిలో క్రేజ్ అందుకుంటాడాని ఇదివరకే దర్శకుడు సుకుమార్ ఒక కామెంట్ చేశాడు. ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే పుష్ప సినిమాలో అతని నటన ఒక్కసారిగా అంచనాలను మార్చేసే విధంగా ఉంటుందని చాలా బలంగా తెలియజేశాడు. చూస్తూ ఉంటే అది నిజమే అని అనిపిస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఇక పాన్ ఇండియా సినిమా రేంజ్ కు సినిమా వెళ్తుందా లేదా అనే అనే అనుమానాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

  సినిమాకు సంబంధించిన మొదటి పాట అనుకున్న సమయానికి అయితే గ్రాండ్ గా విడుదలైంది. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయింది. ఇక సాంగ్ కు సంబంధించిన లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా బాక్సాఫీస్ పీక తెగేలా బన్నీ రికార్డులను క్రియేట్ చేయగలరు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

  దక్కో దాక్కో మేక..

  దక్కో దాక్కో మేక..

  దక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అనే పాటను చంద్ర బోస్ రాయగా యువ సంగీత కెరటం శివమ్ ఆలపించాడు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆలోచింప చేస్తోంది. అంతే కాకుండా అల్లు అర్జున్ పాటలో కనిపించిన విధానం కూడా రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయి.

  అల్లు అర్జున్ నట విశ్వరూపం

  అల్లు అర్జున్ నట విశ్వరూపం

  బన్నీ అయితే మరోసారి నట విశ్వరూపం చూపించనున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. మనిషి ఆకలిని చావును కూడా పాటలో సరికొత్త అర్థం వచ్చేలా పాటలో చెప్పారు. ఇక సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే దర్శకుడు సుకుమార్ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను పాన్ ఇండియా అంచనాలకు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నాడు.

  RRR సాంగ్ తరహాలోనే

  RRR సాంగ్ తరహాలోనే

  మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న పుష్పా సినిమా మొత్తానికి భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇటీవల RRR పాటను ఎలాగైతే ఐదు భాషల్లో ఐదు మంది విభిన్నమైన గాయకులతో రిలీజ్ చేశారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ కూడా ఐదు భాషల్లో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఐదు మంది విభిన్నమైన గాయకులను సెలెక్ట్ చేసుకున్నారు ఇక ప్రతి ఒక్కరు వారి స్టైల్ లో పాట పాడి సినిమాకు మంచి హైప్ ఐతే క్రియేట్ చేశారు.

  సరికొత్త వైబ్రేషన్స్

  సరికొత్త వైబ్రేషన్స్

  ఇక గత రాత్రి సినిమాకు సంబంధించిన ఈ పాట లీక్ అయిన విషయం తెలిసిందే. కాకపోతే దాన్ని దేవిశ్రీప్రసాద్ పాడుతుండగా రికార్డు చేసినట్లు అర్థమైంది. ఇక ఇప్పుడు ఒరిజినల్ పాటను మరో సింగర్ శివమ్ తన గాంభీర్యమైన గానంతో పాడి ఒక సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు అయితే పాఠం ఎవరు లీక్ చేసి ఉంటారని విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల అనుమానాలు వెలువడుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఏదో ఒక విషయం నిరంతరం లీక్ అవ్వడం కామన్ గా మార్పు వస్తోంది అదే తరహాలో పుష్పపై కూడా లీకుల ప్రభావం పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

  కావాలని లీక్ చేశారని

  అయితే కావాలని లీక్ చేశారని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఆ విషయం గురించి అయితే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇదివరకే ఆర్య ఆర్య 2 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మూడో సినిమా చేయాలని గత ఐదేళ్లుగా ఆలోచిస్తున్నా. ఇక ఈ కాంబో మొత్తానికి ఎవరూ ఊహించని విధమైన పుష్ప సినిమాతో రాబోతున్నారు. అసలైతే ఆర్య 3 అనే మరొక ప్రేమకథతో వస్తారని ఓ వర్గం ప్రేక్షకులు అనుకున్నారు. కానీ దర్శకుడు సుకుమార్ పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్లోనే మార్చుకున్నాడు. స్టార్ దర్శకులు కూడా అదే తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.

  Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
  స్టార్ దర్శకుల తరహాలో

  స్టార్ దర్శకుల తరహాలో

  ఇప్పటికే రంగస్థలం సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సౌత్ ఇండియా దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక పుష్ప సినిమా తర్వాత అతని స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమా రిలీజ్ విషయానికి వస్తే రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదటి భాగం ఇదే ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక పోస్టర్ ద్వారా ఈ సమ్మర్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

  అదేవిధంగా రెండవ భాగం వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. పుష్ప 2 షూటింగ్ అయితే దాదాపు 80 శాతం పూర్తయింది పుష్ప అనంతరం అల్లు అర్జున్ పూర్తిగా ఐకాన్ సినిమాపైనే ఫోకస్ పెట్టమన్నాడు మధ్యలో సుకుమార్ కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు అయితే క్లారిటీ వచ్చింది. ఇదివరకే ఆ దర్శకుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా ఓకే చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రావచ్చని సమాచారం.

  English summary
  Daakko Daakko Meka First Song From Allu Arjun's Pushpa Is out Now
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X