వామ్మో, ఇదేంది గురూ తేడాగా ఉంది.. కుర్రహీరోకి రానా ఆసక్తికర ట్వీట్!
తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఫొటో వేదికగా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

కొత్త సినిమా
నిన్న అంటే శుక్రవారం రోజున బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ యంగ్ హీరో నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా తమ్ముడు అంటూ ఆయన చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. నిజానికి బ్రహ్మాజీ, నాగశౌర్య కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా
అయితే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బ్రహ్మాజీ నాగశౌర్య కలిసి ఫోటోకి పోజిచ్చారు. ఈ ఫోటోలో నాగశౌర్య నుదుట కుంకుమ రేఖ ఉండగా, బ్రహ్మాజీ నుదుట నామాలు ధరించి ఉన్నాడు. ఈ ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన నాగశౌర్య.. ''నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్'' అంటూ కామెంట్ చేశాడు.

బాగా పుష్ చేస్తున్నావ్
అయితే ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కావడంతో వెంటనే బ్రహ్మాజీ కూడా స్పందిస్తూ మీ సపోర్ట్ కి థాంక్స్ అన్నా అని పేర్కొన్నాడు. యంగ్ టాలెంట్ ని బాగా పుష్ చేస్తున్నావని అన్నాడు. ఇక ఈ అంశం అంతా చర్చానీయాంశంగా మారింది.

వామ్మో ఇదేంటి గురు
అయితే ఈ ట్వీట్ల విషయంలో శనివారం రానా స్పందించారు. "వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్?" అని ఆసక్తికరంగా ట్వీట్ చేశాడు. వెంటనే శౌర్య కూడా .. "నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే" అని అన్నాడు.
Recommended Video

వరుస సినిమాలు
ఇక సినిమాల విషయానికి వస్తే ఒకపక్క నాగశౌర్య వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. రానా కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టి మంచి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఎక్కడా కాళీ లేకుండా వరుస షూట్లతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











