Deepika Padukone టాలీవుడ్‌లో రెండో భారీ ఆఫర్.. ఆ సూపర్‌స్టార్‌తో రొమాన్స్‌కు రెడీ
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు మరో ప్రాజెక్టు తెరలేపబోతున్నది. కేజీఎఫ్: ఛాప్టర్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కేవలం తెలుగు సినిమాకే పరిమితం కాబోతున్నాడనే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ షూటింగులో బిజీగా ఉండగానే ఎన్టీఆర్‌తో మరో ప్రాజెక్టుకు స్క్రీప్టు సిద్దం చేస్తున్నాడు. అయితే కేజీఎఫ్ 2 ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే?

20 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు అభిమానిని
గత 20 ఏళ్లుగా నేను జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానిని. అతడితో NTR31 తీయాలని స్క్రిప్టు సిద్దం చేసుకొంటున్న సమయంలో నేను 15 సార్లు కలిశాను. అయితే మా కలయికకు వేరే ప్రాధాన్యం కూడా లేకపోయింది. గత రెండేళ్లుగా మేమిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారిపోయాం అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

దీపిక పదుకోన్ భారీ ఆఫర్
ఇక NTR31 రూపొందించే పనిలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించిన పిమ్మట.. ప్రస్తుతం దీపిక పదుకోన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్యాన్ ఇండియా రూపొందే ఈ సినిమా కోసం దీపిక పదుకోన్‌ను ఎంపిక చేశారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నది.

దీపిక పదుకోన్‌కు రెండో సినిమా
ఇక ఎన్టీఆర్‌తో దీపిక పదుకోన్ నటిస్తే.. టాలీవుడ్‌లో ఆమెకు ఇది రెండో చిత్రంగా భావించవచ్చు. ఇప్పటికే ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్‌తో ప్రాజెక్టును కూడా తన ఖాతాలో వేసుకోవడంతో ఆమె క్రేజ్ ఏమిటో ఇప్పుడు స్పష్టమైంది.

ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టం
ఇక టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని, అతడి డ్యాన్సులు, ఫెర్ఫార్మెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. తనకు అవకాశం వస్తే నటించడానికి సిద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో అవకాశం రావడంపై దీపిక పదుకోన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే

RRR తర్వాత ఎన్టీఆర్‌కు పాపులారిటీ
ఇదిలా ఉండగా, RRR తర్వాత ఎన్టీఆర్ అంటే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ సినిమా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆనందాన్ని హద్దు లేకుండా ఉంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తోపాటు సాధారణ ప్రేక్షకుల కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











