For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Chiranjeevi: చిరంజీవి డ్యాన్స్ చేస్తే.. శ్రీదేవి పక్కన ఉన్నా ఎవరు చూడరు.. దేవీ శ్రీ ప్రసాద్ ఫ్యాన్ మూమెంట్

  |

  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి పుట్టిన రోజు రానే వచ్చేసింది.. నిజానికి ఆయన పుట్టిన రోజు రేపు అయినా సరే ఒక రకంగా నిన్నటి నుంచి చిరంజీవి అభిమానులకు సంబరాలు మొదలైపోయాయి.. ఇక ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 6 గంటల నుంచి ఒక స్పెషల్ జూమ్ లైవ్ ఇంటరాక్షన్ నిర్వహిస్తున్నారు చిరంజీవి అభిమానులు. ఈ ఇంటరాగేషన్లో ప్రభాస్ కూడా పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆయన ఇప్పటివరకు ఇంటరాక్షన్ కి అటెండ్ కాలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ లోకి వచ్చి చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుని చిరంజీవి అభిమానులు అందరినీ ఆనందపరిచారు. ఆ వివరాల్లోకి వెళితే.

  ఆల్ రౌండర్

  ఆల్ రౌండర్

  మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వింటేనే తెలియని వైబ్రేషన్స్ మన లోకి వచ్చేస్తాయి అని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవిని చిన్నతనం నుంచి తాను చూస్తూ పెరిగానని తనకు ఆయన ఇన్స్పిరేషన్ అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. అంతేకాక చిన్నప్పుడు ఆయనను చూడగానే తాను ముందుగా డ్యాన్స్ విషయంలో ఫ్లాట్ అయిపోయాను అని ఇండియా మొత్తం మీద డాన్స్ ని రిఫైన్ చేసిన మొట్ట మొదటి వ్యక్తి చిరంజీవి అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రపంచంలో ఆల్ రౌండర్ గా చేయగలిగే హీరో చిరంజీవి ఒక్కరే ఉండొచ్చని కూడా అభిప్రాయపడ్డాడు. మనకు వేరు వేరుగా యాక్షన్ హీరోలు డ్యాన్స్ వేసే హీరోలు ఫ్యామిలీ డ్రామా హీరోలు ఇలా ఉండేవారు కానీ చిరంజీవి అన్నిటినీ మేనేజ్ చేయగలరని ఆయన అన్నారు. ఇప్పుడున్న హీరోలు అందరికీ అలాగే రాబోతున్న తరం హీరోలకు కూడా ఆయన స్ఫూర్తి అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

  చిరంజీవిని మాత్రమే

  చిరంజీవిని మాత్రమే

  అలాంటి డాన్స్ వేయగల సత్తా చిరంజీవి కి మాత్రమే దక్కిందని సాధారణంగా హీరో హీరోయిన్ డాన్స్ వేస్తే ప్రతి ఒక్కరు హీరోయిన్ ని చూస్తారని కానీ చిరంజీవి పక్కన శ్రీదేవి లాంటి వాళ్ళు డాన్స్ చేసినా సరే చిరంజీవిని మాత్రమే ప్రేక్షకులు చూస్తారని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. అలాగే డాన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఎమోషనల్ సీన్స్ పండించడంలో ఆయన దిట్ట అని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి అని కామెడీ పండించడంలో చిరంజీవిని కొట్టే వారే లేరని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి పుణ్యమా అని చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు చిరంజీవి గారి కుటుంబంతో తనకు పరిచయం ఉందని దేవిశ్రీప్రసాద్ అన్నారు.

   వాయిస్ మెసేజ్ లు

  వాయిస్ మెసేజ్ లు

  అంతేకాక చిరంజీవిని ఎప్పుడు చూసినా ఒక నూతన ఉత్తేజం వస్తుందని అందుకే ఆయనను ఎప్పుడు కలిసినా సరే సెల్ఫీ తీసుకుంటానని దేవిశ్రీప్రసాద్ అన్నారు. ఇప్పటికే చాలా సార్లు తీసుకున్నావు కదా మై బాయ్ అని చిరంజీవి అంటారని అయినా సరే మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కొత్తగానే ఉంటుంది అని చెప్పి తాను సెల్ఫీ తీసుకుంటా అని ఆయన అన్నారు. చిరంజీవి దగ్గర నుంచి చాలా పాజిటివ్ నెస్ వస్తుందని పేర్కొన్న దేవిశ్రీప్రసాద్ ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ అలాగే వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ లు పెట్టినప్పుడు కానీ దానిని తాను ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాక చాలా సాధారణ మనిషి లాగా వాట్సాప్ లో ఎమోజి లు పెడుతూ గిటార్ సింబల్స్ లవ్ సింబల్స్ పెడతారని దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

  వేరే లెవెల్

  వేరే లెవెల్

  ఒక్క సారి ఎవరైనా సరే చిరంజీవితో పని చేస్తే అది ప్రొఫెషనల్ రిలేషన్ కి మించి వేరే లెవెల్ కి వెళ్తుంది అని చెప్పుకొచ్చాడు. ఆయన మన మనిషి ఆయన కోసం మనం ఏమైనా చెయ్యొచ్చు అవతలి మనిషి భావించేలా చిరంజీవి ప్రేమ చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అలాగే హీరోలతో సంబంధం లేకుండా ఆయనకు ఎవరి పాట నచ్చినా సరే తనకు ఫోన్ చేసి ఫలానా పాట బాగా చేశావు, ఈ సినిమాకి సంగీతం అందించారు అలాగే సినిమాలో రికార్డింగ్ చాలా నచ్చిందని ఇలా రకరకాలుగా తను ప్రోత్సహిస్తున్నారు అని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు. అలాగే సాధారణంగా మన పుట్టినరోజుకి మన అభిమాన వ్యక్తుల నుంచి మెసేజ్ లు వస్తే ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసి ఉంటుందని చెబుతూ చిరంజీవి తనకు పంపిన మెసేజ్ లను చదివి వినిపించారు దేవిశ్రీప్రసాద్.

  ఆ సీక్రెట్ రివీల్

  ఆ సీక్రెట్ రివీల్

  సాధారణంగా ఆయన తనకు విషెస్ అందించినప్పుడు అది ఆయన అభిమానులకు కూడా తెలిసే లాగా పంచుకుంటూ ఉంటానని అయితే ఈ ఏడాది పంపిన శుభాకాంక్షలు ఇప్పటివరకు పంచుకోలేదని దేవిశ్రీప్రసాద్ అన్నారు. అలా అంటూ ఆయన పంపిన మెసేజ్ ని చదివి వినిపించారు.. ''పుట్టిన రోజు శుభాకాంక్షలు పుట్టిన రోజులు వస్తుంటాయి పోతుంటాయి కానీ నీ లాంటి టాలెంట్ ఉన్న సంగీత దర్శకులు జీవితకాలంలో ఒక్కరే దొరుకుతారు'' అంటూ ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపారని దేవిశ్రీప్రసాద్ వెల్లడించాడు.

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
  చిన్నప్పుడే గిఫ్ట్

  చిన్నప్పుడే గిఫ్ట్

  ఇక తన చిన్నతనంలోనే చిరంజీవి తనకు మర్చిపోలేని బహుమతి ఇచ్చారు అని కూడా దేవిశ్రీప్రసాద్ వెల్లడించాడు. తన చిన్నతనంలో తన తండ్రి చిరంజీవితో కలిసి సినిమాలు చేసేవారని అలా చేయడం తన అదృష్టమని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు. తాను ఎనిమిదో తరగతి లో ఉన్నప్పుడు తన తండ్రి ఒక వీడియో కెమెరా కూడా ఇచ్చాడని ఆ వీడియో కెమెరాలో తాను రకరకాల ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసే వాడినని అన్నారు. ఇది ఒక రోజు తాను చేసిన వీడియోలను చూసిన చిరంజీవి తనను కలుస్తా అని అన్నారు అని ఆయన అన్న మాట ప్రకారం తన ఇంటికి ఆయన ఎల్లో కారులో వచ్చి తనని సర్ ప్రైజ్ చేశారని చెప్పుకొచ్చాడు. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే తాను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని అన్నానని నువ్వు డైరెక్టర్ అయితే నేను నీ డైరెక్షన్లో సినిమా చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాక తన పనిని ఇచ్చి అప్పటికప్పుడు తన చేతికి ఉన్న ప్లాటినం వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు అని ఆయన అన్నాడు. ఆ తర్వాత శంకర్ దాదా ఫంక్షన్ అప్పుడు ఆ వాచ్ తీయించి మరో రాడో వాచ్ కూడా చిరంజీవి తన గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.

  English summary
  Devi Sri Prasad Revealed some secrets about chiranjeevi. a zoom live interaction was conducted on the occasion of Chiranjeevi birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X