Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చిరంజీవికి సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)
ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఆయనకు సరికొత్తగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య' అంటూ ట్వీట్ చేయడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ వీడియోను షేర్ చేశాడు.
Wishing our Dearest 1 & Only #MEGASTAR #Annayya #Chiranjeevi Sir a SUPER DUPER MUSICAL HAPPY BIRTHDAY !!😁🎵🎶🎹❤️🎂🎂🎂🎂🎂🎂🎂🎂
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 22, 2019
Love frm my Whole Team❤️😍#SyeRaaNarasimhaReddy #HBDMegaStarChiranjeevi @KonidelaPro #RamCharan @upasanakonidela @IAmVarunTej @IamSaiDharamTej pic.twitter.com/v5jNjLc7oB
అందులో తన టీమ్ సాగర్, హేమచంద్ర, శ్రావణ భార్గవి తదితరులతో కలిసి డీఎస్పీ.. చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అంతకంటే ముందు చిరంజీవి - దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' టైటిల్ సాంగ్‌ను ఆలపించాడు. ఇందుకు అనుగుణంగా తన టీమ్ మొత్తం అతడికి జత కలిసింది. ఎవరూ చేయని విధంగా చిరును విష్ చేసిన డీఎస్పీని మెగా అభిమానులు అభినందిస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోను తమ ఫ్యాన్ పేజీలలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

అన్నట్లు దేవీ శ్రీ ప్రసాద్ - చిరంజీవి కాంబినేషన్‌లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'అందరివాడు', 'శంకర్ దాదా జిందాబాద్', 'ఖైదీ నెంబర్ 150' సినిమాలు వచ్చాయి. ఇవన్నీ మ్యూజికల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.