Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka trailer Review: త్రివిక్రమ్ మీకు చుట్టమా? రవితేజ మాస్ సెటైర్లు
మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయంతో దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ధమాకా. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా, రఘుబాబు, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 23వ రోజున రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే?

ద్విపాత్రాభినయంతో రవితేజ
ధమాకా ట్రైలర్ చూస్తే.. మురికి వాడలో నివసించే స్వామిగా, అలాగే మల్టీ మిలియనీర్ ఆనంద చక్రవర్తిగా రవితేజ రెండు పాత్రల్లో కనిపించోతున్నారు. స్వామి, ఆనంద్‌ను ప్రేమించిన పావనిగా శ్రీలీల యూత్‌కు గిలిగింతలు పెట్టే పాత్రల్లో నటించింది. అయితే తమకు ప్రధాన శత్రువు అయిన వ్యక్తిని స్వామి, ఆనంద్ ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా కథగా ట్రైలర్ చెప్పే ప్రయత్నం చేసింది. పక్కా మాస్, రెగ్యులర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో విభిన్నమైన అంశాలు ఏమిటి అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.

వెనుక ఎవడు లేకపోయినా
కోట్లలో ఒకడు వాడు.. కొడితే తట్టుకోలేవు.. అమ్మ పండ్లు తెమ్మంది అని రవితేజ అంటే.. పండ్ల షాప్‌కు వెళ్లు అని అంటే.. నిన్న ఒక్కడు పళ్లు గట్టిగా నూరాడట.. వాడి పళ్లు కావాలని అమ్మ చెప్పింది.. మనకు కావాల్సిన వాడికి చేస్తే మోసం.. మనకు కావాలనుకొనే వాడికి చేస్తే న్యాయం అని జయరాం అంటే.. మీరేమైనా త్రివిక్రమ్‌కు చుట్టమా? అంటూ రవితేజ సెటైర్ వేయడం ఫన్‌కు ఎంత స్కోప్ ఉందో తెలిసిపోయింది. నేను వెనుక ఉన్నవాళ్లను చూసుకొని వచ్చిన వాడిని కాదోయో.. వెనుక ఎవడు లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని అనే డైలాగ్స్ మాస్ డైలాగ్స్ తూటాల్ల పేలాయి.

రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ
రవితేజ, శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందనే ఫీలింగ్‌ను ట్రైలర్‌లో కల్పించారు. ఒకడు ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య స్వామి.. ఇంకొకడు నాన్న వాళ్ల ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అని శ్రీలీల చెబితే.. నీకు ఇద్దరు నచ్చారా? అని అడిగితే.. ముద్దుగా ఊకొట్టింది శ్రీలీల. ఇలాంటి సాఫ్ట్ రొమాన్స్ ప్రేక్షకులను ఆలరించడం ఖాయమని స్పష్టమైంది.
త్రివిక్రమ్ స్టైల్‌లో డైలాగ్స్
రవితేజ
మాస్,
మసాలా,
క్లాస్
లుక్‌తో
వస్తున్న
ధమాకా
చిత్రానికి
భీమ్స్
సెసిరోలీయో
మ్యూజిక్
అందించారు.
ఈ
చిత్రంలోని
పాటకు
మంచి
రెస్పాన్స్
వస్తున్న
సంగతి
తెలిసిందే.
కార్తీక్
ఘట్టమనేని
సినిమాటోగ్రఫిని
అందించారు.
ప్రసన్న
కుమార్
బెజవాడ
ఈ
సినిమాకు
మాటలు
అందించారు.
త్రివిక్రమ్‌ను
అనుసరించారనే
ఫీలింగ్
కూడా
ట్రైలర్‌లో
కల్పించాడు.
అన్ని
వర్గాలు
ఆకట్టుకొనే
అంశాలతో
ఈ
సినిమా
తెరకెక్కినట్టు
ట్రైలర్
స్పష్టం
చేసింది.

ధమాకాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు:
రవితేజ,
శ్రీలీల,
జయరాం,
సచిన్
ఖేడ్కర్,
తనికెళ్ల
భరణి,
రావు
రమేష్,
ఆలీ,
ప్రవీణ్,
హైపర్
ఆది,
పవిత్ర
లోకేష్,
తులసి
తదితరులు
దర్శకత్వం:
త్రినాథ
రావు
నక్కిన
నిర్మాత:
టీజీ
విశ్వ
ప్రసాద్
సహ
నిర్మాత:
వివేక్
కుచిభోట్ల
బ్యానర్:
పీపుల్స్
మీడియా
ఫ్యాక్టరీ,
అభిషేక్
అగర్వాల్
ఆర్ట్స్
స్టోరీ,
డైలాగ్స్:
ప్రసన్న
కుమార్
బెజవాడ
మ్యూజిక్:
భీమ్స్
సినిమాటోగ్రఫి:
కార్తీక్
ఘట్టమనేని
ఫైట్స్:
రామ్
లక్ష్మణ్
పీఆర్వో:
వంశీ
శేఖర్