మెగాస్టార్ “లూసిఫర్” రీమేక్ డైరెక్టర్ మార్పు.. క్లారిటీ వచ్చేసింది!

ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తరువాత సైరా సినిమాతో తన చిరకాల స్వప్నం తీర్చుకున్నారు. ఆ సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న ఆయన ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే పలు సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. ఆ రెండు రీమేక్ సినిమాల్లో కూడా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ మీద చిరంజీవి అభిమానులు అందరిలో ఆసక్తి నెలకొంది.

నిజానికి ఈ సినిమా రీమేక్ కోసం ముందు సాహో డైరెక్టర్ సుజిత్ పని చేశారు. అయితే ఏమయిందో ఏమో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఫైనల్ గా రీమేక్ స్పెషలిస్ట్ గా పేరున్న తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా ఎంటర్ అయ్యారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఆయన కూడా తప్పకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆయన చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఆయనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 director mohan raja clarity on lucifer remake

అయితే తాజాగా ఒక రేడియో ఇంటర్వ్యూ లో పాల్గొన్న మోహన్ రాజా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను ఈ సినిమా నుంచి తప్పుకో లేదని ఇప్పటికే తాను క్యాస్టింగ్ మీద కూడా పని చేస్తున్నానని అని చెప్పుకొచ్చారు. ఏవయినా వార్తలు వస్తే అవన్నీ ఒట్టి పుకార్లే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తాను బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెండు పాటలను కూడా సిద్ధం చేశారని ఆయన వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X