Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్ డైరెక్టర్‌కు గుండెపోటు.. కూకట్‌పల్లి హాస్పిటల్‌కు తరలింపు
టాలీవుడ్ యువ దర్శకుడు రాజ్ కిరణ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం (జూన్ 12) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దాంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించినట్టు సన్నిహితులు తెలిపారు.
దర్శకుడు రాజ్ కిరణ్‌కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. తన అనారోగ్యం విషయాన్ని తెలియజేయడంతో ఆయనను కూకట్ పల్లిలోని ఓమిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారు అని సన్నిహితులు తెలిపారు.

ప్రముఖ దర్శక, నిర్మాత కోన వెంకట్ రూపొందించిన గీతాంజలి చిత్రం ద్వారా 2014లో రాజ్ కిరణ్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత త్రిపుర అనే చిత్రంలో నటించారు. 2017లో లక్కున్నొడు, 2018లో విశ్వామిత్ర సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వామిత్ర చిత్రం జూన్ 14న రిలీజ్ కానున్నది. ఈ సినిమాను స్వంత బ్యానర్‌పై రూపొందించి రిలీజ్‌కు సిద్ధమయ్యారు.