Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మసూద సీక్వెల్ పై డైరెక్టర్ కామెంట్.. ఎవరు ఉహించని సమాధానం!
పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మసూద సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ రావా సినిమాతో డీసెంట్ నిర్మాతగా కనిపించిన రాహుల్ ఊహించిన విధంగా మసూద సినిమాను నిర్మించిన విధానం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. జెర్సీ సినిమాకు సహాయక దర్శకుడుగా వర్క్ చేసిన సాయికిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలను అందించింది. మొత్తంగా నిర్మాత దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత భారీ స్థాయిలో లాభాలను అందించిన ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుంది అని అందరూ ముందే ఊహించారు. ఎందుకంటే సినిమా చివరలో దర్శకుడు మళ్ళి మసూద సీక్వెల్ కు సంబంధించిన సన్నివేశాలను హైలెట్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. దాంతో తప్పకుండా సీక్వెల్ ఉంటుందేమో అని అందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు.

అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సాయికిరణ్ ఆ విషయంపై ఎవరు ఊహించని విధంగా ఒక సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ అయితే సినిమాకు తప్పకుండా ఒక పది సీక్వెల్స్ తీసుకొవచ్చిన వర్కవుట్ అవుతుంది అని చెప్పగా సాయికిరణ్ మాత్రం అలాంటిదేమీ లేదు అని చెప్పడం విశేషం. ఎందుకంటే తాను అసలు సీక్వెల్ గురించి ఎలాంటి పాయింట్ కూడా అనుకోలేదని అన్నాడు.
మొదట మసూద సినిమాకు సంబంధించిన ఒక కథ అనుకున్నాను. అది తెరపై చూపించాను. ఇక దాని తర్వాత ఏమిటి అనే విషయంలో నాకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇంతవరకు సీక్వెల్ ఐడియాపై కూడా ఫోకస్ పెట్టలేదు. భవిష్యత్తులో ఏదైనా మంచి ఐడియా వస్తే ఉండవచ్చు.. ఉండకపోవచ్చు.. అని కూడా ఈ దర్శకుడు సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.