OG ప్రీక్వెల్‌లో అకీరా నందన్.. ఒక్క డైలాగ్‌తో డైరెక్టర్ సుజీత్ క్లారిటీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG). ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పవన్ లుక్, డైలాగ్స్, మేకోవర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి అంశంలోనూ పవర్‌ఫుల్ వైబ్స్ కనిపించాయి. సినిమా చూసిన ప్రేక్షకులు "ఇదే మన పవన్" అంటూ థియేటర్లలో పండుగ చేసుకున్నారు. భారీ హిట్ అందుకున్న ఓజీకి ప్రిక్వెల్ గానీ, సిక్వెల్ గానీ ఉంటాయని హింట్ ఇచ్చారు. మూవీ మేకర్స్. దీంతో అయితే.. ఆ సినిమాల్లో పవన్ తనయుడు అకీరా నందన్ నటించబోతున్నారని టాక్. తాజాగా ఈ విషయంపై మూవీ డైరెక్టర్ సుజీత్ క్లారీటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
"సాహో"తర్వాత సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓజీ (OG)సినిమా మీద మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక "RRR", "సరిపోదా శనివారం" వంటి భారీ హిట్స్ తర్వాత ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ సినిమాను నిర్మించడంతో హైప్ మరింత పెరిగింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు.
సినిమా కథ గంభీర అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. జపాన్‌లో యుద్ధ విద్యల్లో నైపుణ్యం సాధించిన గంభీర్ (పవన్ కళ్యాణ్) తన వారందరినీ కోల్పోయి, ముంబైకి చేరి అక్కడి మాఫియా ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెస్తాడు. కానీ, అనుకోకుండా దాదా పెద్ద కుమారుడు చనిపోవడంతో, గంభీర్ అదృశ్యమవుతాడు. ఆ తర్వాత ఏళ్లకు తిరిగి వచ్చి తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే ఈ కథ పూర్తిగా పవన్ కల్యాణ్ శైలిలో సాగుతుంది. ప్రతి పదినిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్, పవన్ యాక్షన్ సీక్వెన్సెస్, స్టైలిష్ డైలాగ్స్, సుజీత్ టేక్, ముఖ్యంగా తమన్ (Thaman) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.

ఇక సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ నుంచే థియేటర్లలో కేకలు, విసిల్స్, ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా ఉండదు. "హు ఈజ్ గంభీర్?" అనే సస్పెన్స్ థీమ్, పవన్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవల్. అన్నీ మైండ్ బ్లోయింగ్. సాధారణ ప్రేక్షకుడి అనుభవం వేరేగా ఉండవచ్చు గానీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రమే పండుగే.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ తన మాస్ ఇమేజ్‌ని రీడిఫైన్ చేసుకున్నాడు. సుజీత్ దర్శకత్వం వలన పవన్‌కి కొత్త ఆరా, కొత్త స్టైల్, కొత్త డెప్త్ వచ్చిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే 'ఓజీ యూనివర్స్'పై కూడా అంచనాలు పెరిగాయి. ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్స్‌తో సుజీత్ పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం. ఫ్యాన్స్ ఇప్పుడు పవన్ గంభీర్‌గా తిరిగి స్క్రీన్‌పై కనిపించే రోజు కోసం ఎదురు చూస్తున్నారు.
ఓజీ యూనివర్స్‌లో అకీరా కన్ఫర్మ్?
ఓజీ (OG)చూసిన ఫ్యాన్స్‌లో చాలా మంది పవన్ చిన్ననాటి సన్నివేశాల్లో ఆయన కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) నటిస్తే బాగుండేదని అనుకున్నారు. ఈ అంశంపై తాజాగా డైరెక్టర్ సుజీత్ (Sujeeth) స్పందించారు. అమెరికా డల్లాస్‌లో 'OG' మూవీ స్క్రీనింగ్ సందర్భంగా సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) థియేటర్‌కి వెళ్లి ఫ్యాన్స్‌తో కలిసి మూవీని చూశారు. ఈ సమయంలో ఒక ఫ్యాన్ ఓజీ (OG)ప్రీక్వెల్‌లో అకీరా ఉన్నారా?" అని అడిగాడు. దానికి సుజీత్ స్మైలింగ్‌గా 'ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు'అంటూ హైప్ పెంచేశాడు. ఈ రిప్లై విన్న ఫ్యాన్స్‌లో కొత్త ఊపు వచ్చింది. సోషల్ మీడియాలో " ఓజీలో అకీరా కన్ఫర్మ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గతంతో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ "ఇది 'OG యూనివర్స్' మొదటి దశ మాత్రమే. ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ వస్తాయి. గంభీర్ తండ్రి సుభాష్ చంద్రబోస్ కథ, జపాన్‌లో జరిగిన యాకూజా యుద్ధాలు... ఇవన్నీ చూపిస్తాం," అని చెప్పాడు. ఇక సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ నేచురల్ స్టార్ నాని (Nani)తో ఉండబోతోంది. విజయదశమి సందర్భంగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాగా, ఇది నాని కెరీర్‌లో 34వ సినిమా.
ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్, అనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది యాక్షన్, ఎమోషన్, కామెడీ కలిపిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.
ఇదిలా ఉంటే.. 'OG' బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీలో ఉంది. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ సినిమాలు ఉండవని కొన్ని రూమర్స్ వచ్చినా, సక్సెస్ ఈవెంట్‌లో పవన్ స్వయంగా 'ఇదే కాదండి, ఇంకా ఉంది.. 'OG యూనివర్స్'లో నేనే ఉంటాను!" అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తనయుడు ఆకీరా నందన్ ఉండబోతున్నదని డైరెక్టర్ సుజీత్ ఇన్ డైరెక్టర్ గా చెప్పడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కొత్త జోష్ నెలకొంది.


Click it and Unblock the Notifications











