ప్రభాస్ ‘సలార్’లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.. తెలుగులో రెండోసారి!

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత నటించిన 'సాహో'తో హిందీలో తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు. దీంతో ఇకపై వరుసగా భారీ చిత్రాల్లోనే నటించాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులనే ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'KGF' వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' అనే సినిమాను చేయబోతున్నాడు. తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది.

త్వరలో పట్టాలెక్కనున్న 'సలార్' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఫిక్స్ చేశారట దర్శక నిర్మాతలు. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరపగా, ఈ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు వెంటనే ఓకే చేసేసిందట ఆ భామ. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లోఫర్' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇక, ప్రభాస్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.

Disha Patani Fix for Prabhass Salaar

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాతో ప్రభాస్‌కు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X