Just In
- 47 min ago
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- 1 hr ago
ఇంట్రెస్టింగ్ అప్డేట్: అల్లు అర్జున్ సినిమాలో విలన్ నవదీప్ కాదు.. ఈ సీనియర్ నటుడే.!
- 1 hr ago
శబ్దం, శాసనం అంటూ బోయపాటి స్టైల్ డైలాగ్‌లు.. మళ్లీ బాలయ్య రచ్చ రచ్చే
- 2 hrs ago
ఫ్యాన్సీ రేట్‌కు వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు
Don't Miss!
- Finance
కార్వీ కేసు: బ్యాంకులకు ఊరట అప్పీలును తిరస్కరించిన ‘శాట్’
- News
దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
యాక్సిడెంట్ ఘటనతో అవన్నీ తెలిశాయి.. కారు ప్రమాదంపై స్పందించిన రాజశేఖర్
హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రాజశేఖర్, జీవితా రాజశేఖర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా.. వార్తలు మాత్రం ఆగడం లేదు. దీంతో స్వయంగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన రాజశేఖర్.. తాను క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

మొదటగా స్పందించిన రాజశేఖర్
క్షేమంగా ఇంటికి చేరిన రాజశేఖర్ తనకు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు' అని చెప్పారు.

ఆగని రూమర్లు..
రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త రాగానే.. దానికి సంబంధించిన కథనాలు చానెల్స్‌లో రావడం మొదలయ్యాయి. ఆయన కారులో మద్యం సీసాలు లభించాయని, మితి మీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మద్యం సేవించి వాహనం నడిపారని ఇలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటన్నంటిపై జీవిత స్పందించింది. ప్రమాదం జరిగిన విషయం తదనంతరం జరిగిన పరిణామాల గురించి ఓ వీడియో ద్వారా అందరికీ తెలిపింది.

స్పందించిన జీవిత
ఆయన రామోజీ ఫీల్మ్ సిటీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారు టైర్లు బరస్ట్ అవ్వడం వల్ల డివైండర్‌ను ఢీకొట్టి అటు వైపు బోల్తా కొట్టిన్నట్లు తెలిపింది. అయితే అటువైపు నుంచి ఓ కారులోంచి వస్తోన్న ఓ ఫ్యామిలీ.. రాజశేఖర్‌ను గుర్తు పట్టినట్లు, వారే ఆయనను కాపాడినట్టు తెలిపింది. వారి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మాకు, పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన క్షేమంగా ఉన్నారని,ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన రాజశేఖర్..
మరోసారి తనకు జరిగిన ప్రమాదంపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చారు. తాను క్షేమంగా ఉన్నట్లు, ఎలాంటి గాయాలు కాలేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు.. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలాంటి గాయాలు కాలేదు.. క్షేమంగా బయటపడ్డానని తెలిపారు. బండి బోల్తా కొట్టడంతో ఒంట్టో నొప్పిగా ఉంది. అంతే కానీ ఎలాంటి గాయాలు కాలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది..
ఈ ప్రమాదం జరగడంతో తనకు కొన్ని విషయాలు తెలిశాయని పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలిశాక చాలా మంది ఫోన్‌లు, మెసెజ్‌లు చేస్తున్నారని, దీన్ని బట్టి తాను ఎంతో కొంత సాధించానని, తనకు మంచి స్నేహితులున్నారని తెలిసిందని చెప్పుకొచ్చారు. మీ అందరి సపోర్ట్ వల్లే తాను బాగున్నానని, తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు.