Evil Life.. ప్రేమకథా చిత్రం కంటే పెద్ద హిట్.. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈవిల్ లైఫ్
బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై వెంకట్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఈవిల్ లైఫ్. రాణి స్వాతి కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం నిర్మాత టీ ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, ఆచంట గోపీనాథ్ పాటలను ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రసన్నకుమార్, వెంకట్, కర్రి బాలాజీ, రామసత్యనారాయణ, గౌతం రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రన్నకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. హీరో, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్ని తానై వెంకట్ సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. మారుతి తీసిన ప్రేమకథాచిత్రమ్ ఎలాగైతే సింపుల్‌గా భారీ హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో చక్కని ఫీల్ ఉంటుంది. వైజాగ్ శంకర్ ఈ సనిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు అని అన్నారు.
హీరో, దర్శకనిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. మా ఈవిల్ లైఫ్ సినిమా ట్రైలర్ లాంచ్‌కి వచ్చిన ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, ఆచంట గోపినాథ్, కర్రి బాలాజీ తదితరులకు కృతజ్ఞతలు. సినిమా అంటే ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. అన్ని నేనే అయ్యి సినిమా పూర్తి చేశా. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశా. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని అన్నారు.
కర్రి బాలాజి మాట్లాడుతూ.. బ్యాక్ డోర్ సినిమాకు థియేటర్లు దొరకకపోతే శంకర్ ధైర్యంగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా భుజాన వేసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈవిల్ లైఫ్ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. వైజాగ్ ప్రాంతంలో చిన్న సినిమాల పాలిట దేవుడులాంటి వ్యక్తి శంకర్. ఈ సినిమా బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు అని అన్నారు
గౌతంరాజు మాట్లాడుతూ ''ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ట్రైలర్‌నాకు బాగా నచ్చింది అని అన్నారు. సినిమా మీద ప్యాషన్ ఉన్నవాళ్లంటే నాకెంతో ఇష్టం. అందుకు పాటను విడుదల చేయడానికి వచ్చాను అని అచంట గోపినాథ్ అన్నారు.
నటీనటులు: వెంకట్, రాణి స్వాతి, శ్యామల, అంజి, లతా, రాము తదితరులు
కెమెరా: బీఎస్ కుమార్-ఎస్.ఎస్. కుమార్
సంగీతం: దిలీప్
పీఆర్వో: వెల్లూరి మధు


Click it and Unblock the Notifications











