Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
గంగవ్వ రేంజ్ మామూలుగా లేదు.. ప్రత్యేకంగా కారావాన్.. దాని రేటెంతో చెబుతూ..
యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో గంగవ్వ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఆమె మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో మొదట ఒక చిన్న క్యారెక్టర్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకునే వరకు వచ్చింది. ఆ మధ్య బిగ్ బాస్ లో కూడా హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గంగవ్వ కొంతమంది సెలబ్రిటీలతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో గంగవ్వ స్టార్ హోదా ఏ స్థాయిలో పెరిగిందో మరోసారి అర్థమైపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ స్థాయిలో క్రేజ్
పక్కా విలేజ్ వాతావరణంతో ఎంతగానో ఆకట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్ లో మై విలేజ్ షో ఛానల్ టాప్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా అందులో గంగవ్వ పాత్ర ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ యాసలో పక్కా నేచురల్ గా ఉండే విధంగా ఆమె నటించే విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ లో అలా..
అయితే గంగవ్వ కేవలం యూట్యూబ్ ద్వారానే కాకుండా టెలివిజన్ రంగంలో అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ మంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటుంది. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో మంచి పోటీ ఇచ్చినప్పటికీ పలు అనారోగ్య కారణాల వలన ఆమె మధ్యలోనే బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది.

సొంతంగా ఇల్లు
ఇక
బిగ్
బాస్
నుంచి
బయటకు
వచ్చిన
తర్వాత
గంగవ్వ
సొంత
ఇంటిని
నిర్మించుకుంది.
నాగార్జున
ఆర్థిక
సహాయం
అలాగే
బిగ్బాస్
ద్వారా
వచ్చిన
రెమ్యునరేషన్
తో
ఆమె
ప్రత్యేకంగా
తన
సొంత
ఊర్లోనే
ఒక
మంచి
ఇల్లును
నిర్మించుకొని
అందుకు
సంబంధించిన
వీడియోను
కూడా
యూట్యూబ్లో
విడుదల
చేసింది.

సెలబ్రేతీలతో ఇంటర్వ్యూ
అయితే అప్పుడప్పుడు గంగవ్వ కొత్త సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నటీనటులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేయడం జరుగుతుంది. మై విలేజ్ షో టీమ్ తో కలిసే ఇదివరకే ఆమె సమంత సాయి పల్లవి తమన్నా అలాగే చాలామంది సెలబ్రిటీలతో కూడా ఇంటర్వ్యూలు చేసే మంచి క్రేజ్ అయితే అందుకుంది.

కారావాన్ లో గంగవ్వ
అయితే ఈ క్రమంలో ఆమెకు ప్రత్యేకంగా కారావాన్ కూడా ఇస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో విరాటపర్వం విడుదలవుతున్న సందర్భంగా హీరో హీరోయిన్ తో కలిసి గంగవ్వ ప్రత్యేకంగా మరొక ఇంటర్వ్యూ చేసింది. రానా దగ్గుపాటి సాయిపల్లవి ఇద్దరు కూడా చాలా సరదాగా ఆమెతో మాట్లాడారు. అయితే గంగవ్వ ముందుగానే కారావాన్ వ్లాగ్ వీడియో ద్వారా తన అనుభవాన్ని తెలియజేసింది.

కారావాన్ రేటు ఎంతంటే?
కారావాన్ లో ఉన్నప్పుడు గంగవ్వ చాలా అద్భుతంగా ఉంది అంటూ అందులో సదుపాయాల గురించి కూడా తెలియజేస్తుంది. అలాగే దాని రేటు దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది అని కూడా తెలియజేయడం విశేషం. అయితే తాను ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా కూడా ప్రత్యేకంగా కారావాన్ కూడా ఇస్తున్నారు అని చిరంజీవి గారి సినిమాకు అలాగే మరికొన్ని సినిమా షూటింగ్స్ కు వెళ్ళినప్పుడు కూడా కారావాన్ ఇచ్చారని గంగవ్వ వివరణ ఇచ్చింది.