Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
MICHAEL: సందీప్ పాన్ ఇండియా మూవీలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. సేతుపతి పాత్రపై అయోమయం
అద్భుతమైన టాలెంట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా.. సరైన హిట్లు దొరకక ఇబ్బందులు పడుతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడమో.. మరో కారణమో తెలియదు కానీ.. అతడు వరుస పెట్టి ఎన్ని సినిమాలు చేసినా సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. సుదీర్ఘమైన కెరీర్‌లో మూడు నాలుగు విజయాలను మాత్రమే అందుకున్న అతడు.. సక్సెస్ కోసం చాలా కాలంగా నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి ఎన్నో సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు చిత్రాలతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న సందీప్ కిషన్.. తమిళంలోనూ పలు మూవీల్లో నటించాడు. ఈ క్రమంలోనే అక్కడ కూడా సుపరిచితుడు అయ్యాడు. దీంతో అతడికి రెండు పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ ఇప్పుడు ఏకంగా 'మైఖేల్' అనే ఓ పాన్ ఇండియా సినిమాలోనే నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఈ యంగ్ హీరోతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. రంజిత్ జయకోడి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'మైఖేల్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్‌లో దెబ్బలు తిని ఉన్న రెండు చేతులు కనిపిస్తున్నాయి. అందులో ఓ దానికి సంకెళ్లు ఉండగా.. మరో చేతిలో ఆయుధం ఉంది. దీంతో ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా ప్రకటించారు. తద్వారా ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెంచేశారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మైఖేల్' మూవీ గురించి తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రకటన చేసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కూడా ఒక రక్తం కారుతోన్న చేయి.. దానికి సంకేళ్లు వేసి ఉండడం కనిపించింది. తాజా సమాచారం ప్రకారం.. గౌతమ్ మీనన్ ఇందులో చేసేది విలన్ పాత్ర అని అంటున్నారు. దీంతో ఇందులో విజయ్ సేతుపతి ఏ రోల్ చేస్తున్నారు అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మైఖేల్' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలను అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో.. అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.