For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Telugu Remakes: 2022లో అదరగొట్టిన తెలుగు రీమెక్ సినిమాలు.. హిట్ కొట్టాయా అంటే?

  |

  ఇంతకుముందు తెలుగులో రీమెక్ సినిమాలు వచ్చాయంటే కచ్చితంగా హిట్ అవుతాయన్న నమ్మకం ఉంది. కానీ ప్రస్తుతం ఓటీటీలో హవా తెగ పెరిగిపోయింది. అది ఏ భాషా చిత్రమైన సరే బాగుంది అంటే సబ్ టైటిల్స్ తో చూసేసి మరి సూపర్ హిట్ చేస్తున్నారు. తర్వాత వాటిని రీమేక్ గా తీసుకురాగా.. అందులో కొన్ని విజయం సాధిస్తున్నాయి. మరికొన్ని బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతున్నాయి. అలా ఈ 2022 సంవత్సరం వివిధ భాషల నుంచి నేరుగా తెలుగులో రీమేక్ అయిన సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దామా!

   భీమ్లా నాయక్..

  భీమ్లా నాయక్..

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సంవత్సరం అలరించిన సినిమా భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమెక్ గా వచ్చిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 25న విడదలైన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ రీమెక్ చిత్రాలకు పెట్టింది పేరు. దబాంగ్ రీమెక్ గబ్బర్ సింగ్ తో బంపర్ హిట్ కొట్టిన ఆయన గతేడాది మరో బాలీవుడ్ ఫిల్మ్ పింక్ కు రీమెక్ గా వకీల్ సాబ్ మూవీ చేశాడు.

  శేఖర్..

  శేఖర్..

  యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. పీఎస్ఎల్వీ గరుడ వేగ, కల్కి చిత్రాల తర్వాత నటించిన రాజశేఖర్ నటించిన మూవీ శేఖర్. మే 20న విడుదలైన ఈ సినిమా 2018లో ఘన విజయం సాధించిన మలయాళ మూవీ జోసేఫ్ కు రీమేక్. లాంగ్ గ్యాప్ తర్వాత జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించన ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు శివాని కూడా ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

   శాకిని డాకిని..

  శాకిని డాకిని..

  టాలీవుడ్ ముద్దుగుమ్మలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ తొలిసారిగా నటించిన చిత్రం శాకిని డాకిని. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ సినిమా కొరియన్ హిట్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ గా వచ్చింది. రెజీనా, నివేదాల యాక్షన్ సీక్వెన్స్, యాక్టింగ్ ఆకట్టుకున్న సినిమా మాత్రం అంతగా ఆకర్షించలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓటమి పాలైందనే చెప్పాలి.

  గాడ్ ఫాదర్..

  గాడ్ ఫాదర్..

  మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత అలరించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన మలాయళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా ఈ చిత్రం వచ్చింది. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం టాక్ పరంగా సక్సెస్ సాధించినప్పటికీ వసూళ్ల పరంగా అంతగా రాబట్టలేకపోయింది.

  ఓరి దేవుడా..

  ఓరి దేవుడా..

  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా అలరించిన చిత్రం ఓరి దేవుడా. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం ఓ మై కడవులే మూవీకి రీమెక్ వెర్షన్. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి టాక్ మాత్రం పాజిటివ్ గానే వచ్చింది. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ సైతం అనేక రీమేక్ చిత్రాల్లో నటించి హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

  ఊర్వశివో రాక్షసివో..

  ఊర్వశివో రాక్షసివో..

  తనదైన శైలీలో ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై అల్లు శిరీష్ దర్శనం ఇచ్చిన సినిమా ఊర్వశివో రాక్షసివో. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అల్లు శిరీష్ కు జోడిగా అను ఇమ్మాన్యుయెల్ ఆకట్టుకుంది. తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్ కు రీమెక్ గా వచ్చిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న విడుదలై మంచి సక్సెస్ సాధించింది.

  రిపీట్..

  రిపీట్..

  అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర ఇటీవల మధ్య ఓటీటీ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఆయన నటించిన పరంపర వెబ్ సిరీస్ చాలా వరకు బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవల రిపీట్ అనే సినిమాతో నేరుగా ఓటీటీలోకి వచ్చాడు నవీన్ చంద్ర. తమిళ చిత్రం డేజావుకు రీమేక్ గా వచ్చిన రిపీట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్ర పోషించింది.

   గుర్తుందా శీతాకాలం..

  గుర్తుందా శీతాకాలం..

  డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్న హీరో సత్యదేవ్. ఆయన హీరోగా తాజాగా వస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటి తమన్నా నటించింది. డిసెంబర్ 9న అంటే రేపు శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ కు రీమెక్. అయితే ఈ సినిమాలో తెలుగు నెటివిటీకి తగినట్లు కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.

  English summary
  Top Tollywood Remake Movies Which Released In 2022 Year
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X