'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్.. మరోసారి స్టైల్ తోనే అదరగొట్టిన గోపిచంద్
మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గోపిచంద్ గతకొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. లౌక్యం, జిల్ వంటి సినిమాల అనంతరం గోపిచంద్ సరైన హిట్ అందుకోలేదు. ఆ తరువాత చేసిన 7 సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్టు కొట్టాలని గోపిచంద్ విభిన్నమైన కథలను టచ్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.
చివరగా చాణక్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిచంద్ నెక్స్ట్ సీటీమార్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బడా ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మరోవైపు మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమా షూటింగ్ కొంత పూర్తయ్యింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ GA2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక జూన్ 12న గోపిచంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో గోపిచంద్ స్టైలిష్ స్టిల్ తో ప్రేక్షకులను సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే ఈ బ్యూటీ హీరోతో జిల్ సినిమా చేసి హిట్ కొట్టింది.
ఇక మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే అనే సినిమా చేసింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రాశి ఖన్నా ఈ పక్కా కమర్షియల్ సినిమాతో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











