For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Seetimaar Trailer: కబడ్డీలో గోపీచంద్ యాక్షన్ కూత మామూలుగా లేదు.. హిట్టు గ్యారెంటీ!

  |

  ఇటీవల పంతం, చాణక్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ హీరో గోపీచంద్ కొంత గ్యాప్ తరువాత చేసిన సిటీమార్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. గతంలో గౌతమ్ నంద వంటి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసిన సంపత్ నంది దర్శకత్వంలో మరొక్కసారి గోపిచంద్ ఎంతో ఇష్టంగా ఈ సీటీ మార్ సినిమా చేశాడు. ఇక ఫైనల్ గా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో వుమెన్ కబడ్డీ ఆటతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది.

  యూట్యూబ్ లో సెన్సెషన్

  యూట్యూబ్ లో సెన్సెషన్

  ఇక చాలా గ్యాప్ తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా గోపీచంద్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికో వచ్చిన సాంగ్స్ మాదిరిగా ఈ సినిమాలో కూడా సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే జ్వాలా రెడ్డి అనే సాంగ్ యూట్యూబ్ లో సెన్సెషన్ ను క్రియేట్ చేసింది. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఒక కీలకమైన రోల్ లో భూమిక చావ్లా కనిపించనుంది.

  కబడ్డీ నేపథ్యంలో..

  కబడ్డీ నేపథ్యంలో..

  ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కబడ్డీ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో ఆంధ్రా వుమెన్ కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, అలానే తెలంగాణ కోచ్ గా తమన్నా ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

  పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్

  పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్

  రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు సర్, అదే రూట్ లెవెల్ నుండి ఆట నేర్పి పంపిస్తే పేపర్ లో వస్తారు సర్, మన దేశంలో మగవారు కనీసం 60 ఏళ్ళు బ్రతికి చనిపోతున్నారు, అయితే ఆడవాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కానీ ఇరవై ఏళ్లకే చనిపోతున్నారు. చంపేద్దామా వీళ్లందరినీ అంటూ గోపీచంద్ ఎమోషనల్ గా పలికే డైలాగ్స్ నిజంగా ఆకట్టుకున్నాయి. వాటితో పాటు ట్రైలర్ లో భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి.

  అదిరిపోయే యాక్షన్ విజువల్స్

  ముఖ్యంగా అదిరిపోయే యాక్షన్ విజువల్స్ తో పాటు సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన వండర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది. మొత్తంగా ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో పాటు లైక్స్ కూడా రాబడుతూ దూసుకెళుతోంది. కాగా ఇప్పటికే సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా, నేడు ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు స్థాయిని మరింతగా పెంచింది అని చెప్పవచ్చు.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ప్రభాస్ చీఫ్ గెస్ట్..

  ప్రభాస్ చీఫ్ గెస్ట్..

  ఇక త్వరలో జరుగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ రానున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాని ఈ నెల 10వ తేదీన వినాయకచవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మరి అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

  English summary
  Gopichand Seetimaar movie telugu Trailer..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X