Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Happy birthday Dhanush ఆకట్టుకొన్న ధనుష్.. సార్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!
జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సార్ (తమిళంలో వాతీ) చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సారికా స్టూడియోస్ బ్యానర్‌పై వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నది.
యాంబిషయస్ జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్ ఉపశీర్షికతో వచ్చిన టైటిల్ రివీల్ వీడియో సార్ సినిమాపై అంచనాలు పెంచింది. విద్యావ్యవస్థ నేపథ్యంగా క్యాంపస్ పరిధిలో జరిగే కథ విభిన్నంగా కనిపించింది. ఇక ధనుష్ బర్త్ డే పురస్కరించుకొని సర్ (వాతి) సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
సార్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలకు తగినట్టుగానే ఉందనే ఫీలింగ్ కల్పించింది. లైబ్రరీ మధ్యలో పుస్తకాల మధ్య ఓ టేబుల్‌పై పుస్తకం చదివుతూ ధనుష్ కనిపించారు. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ధనుష్ బర్త్ డే కానుకగా జూలై 28 తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించారు.

సర్ సినిమా గురించి దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ధనుష్ ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషిస్తున్నారు. జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.
సార్ అక్టోబర్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు
నటీనటులు:
ధనుష్,
సంయుక్తా
మీనన్,
సాయికుమార్,
తనికెళ్ల
భరణి,
సముద్ర
ఖని,తోటపల్లి
మధు,
నర్రా
శ్రీను,
పమ్మి
సాయి,
హైపర్
ఆది,
సారా,
ఆడుకాలం
నరేన్,
ఇలవరసు,
మొట్టా
రాజేంద్రన్,
హరీష్
పేరడి,
ప్రవీణ
తదితరులు.
రచన,
దర్శకత్వం:
వెంకీ
అట్లూరి
నిర్మాతలు:
నాగవంశీ
ఎస్,
సాయి
సౌజన్య
ప్రొడక్షన్
డిజైనర్:
అవినాష్
కొల్లా
ఎడిటర్:
నవీన్
నూలి
సినిమాటోగ్రాఫర్:
జే
యువరాజ్
మ్యూజిక్:
జీవీ
ప్రకాశ్
కుమార్
యాక్షన్
కొరియోగ్రాఫర్:
వెంకట్
సమర్పణ:
శ్రీకర
స్టూడియోస్
పీఆర్వో:
లక్ష్మీవేణుగోపాల్