Don't Miss!
- News
Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: న్యూ ఇయర్‌కు ఆ గిఫ్ట్‌పై క్లారిటీ
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత స్పీడుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' మూవీతో కమ్‌బ్యాక్ అయిన అతడు.. ఆ తర్వాత 'భీమ్లా నాయక్'తో ప్రేక్షకులను అలరించాడు. వీటి ఫలితాలను పక్కన పెడితే ఆ తర్వాత మరెన్నో సినిమాలను కూడా ఓకే చేసేశాడు. ఇలా ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!
మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి.. టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అన్ని పనులపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి కొత్త గ్లింప్స్ వీడియో రాబోతుందని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' సినిమాను డిసెంబర్ 31న రిరిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త గ్లింప్స్ వీడియోను యాడ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో అలాంటి వీడియోను ఎటాచ్ చేయడం లేదట. కానీ, ఇప్పటికే 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి విడుదలైన ఓ గ్లింప్స్ వీడియోను చూపించబోతున్నారని తెలిసింది. దీంతో న్యూ ఇయర్ గిఫ్ట్‌పై ఆశలు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశను లోనవుతున్నారు.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ఇదిలా ఉండగా.. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నారు.