Just In
- 11 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 38 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 55 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 1 hr ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హరీష్ శంకర్ ట్వీట్.. డైలామాలో నెటిజన్లు.. బన్నీ-మహేష్ ఫ్యాన్స్ వార్
సంక్రాంతి బరిలోకి పెద్ద హీరోలు దిగితే ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఈ ఏడాది సీజన్ చూపించింది. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు.. మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. సరిలేరు చిత్రంతో మహేష్ బాబు రంగంలోకి దిగితే.. అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ బరిలోకి దిగాడు. టాక్ ఎలా ఉన్నా.. రెండు చిత్రాలకు వసూళ్లు మాత్రం అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధిస్తూ.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాలనే తాపత్రయంతో చేసే పనులతో అభాసుపాలవుతున్నారు.

పోస్టర్లతో పోటీ..
కలెక్షన్స్, రికార్డులు అంటూ ఇరు చిత్ర యూనిట్లు చేసే పనులు మరీ వేళాకోళంగా మారాయి. తెల్లవారితే చాలు పది కోట్లు లేదా ఇరవై కోట్లు కలిపి ఓ పోస్టర్ వేసేయడం.. దాంతో అవతలి టీమ్ మరోటి వదలడం లాంటి వాటితో నిజమైన కలెక్షన్లు ఏవో తెలుసుకోలేని పరిస్థితికి వచ్చారు.

మొదలుపెట్టిన అల..
అల వైకుంఠపురములో సినిమా మార్నింగ్ షో అయిపోగానే... సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్ వేసారు. దాంతో సరిలేరు టీమ్.. బ్లాక్ బస్టర్ కా బాప్, సంక్రాంతి మొగుడు అంటూ పోస్టర్లను రిలీజ్ చేశారు. అక్కడి ఈ వ్యవహారం.. ఇండస్ట్రీ రికార్డులు, నాన్ బాహుబలి రికార్డుల వరకు వెళ్లింది.
|
అన్ని సినిమాలు ఆడాలి..
అయితే బన్నీ, కళ్యాణ్ రామ్ మాత్రం.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అన్ని సినిమాలు హిట్ కావాలి, మంచిగా ఆడాలని కోరుకున్నారు. మహేష్ మాత్రం ఈ విషయంలో పెదవి విప్పలేదు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో కాస్త నెగెటివిటీ పెరిగింది.

తాజా ట్వీట్‌తో డైలామా..
హరీష్ శంకర్ చేసిన ఓ ట్వీట్ అందర్నీ డైలామాలో పడేసింది. నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్.. నేను గెలవాలి.. ఓకే.. నేనే గెలవాలి సారీ బాస్.. అంటూ ఓ పజిల్ లాంటి ట్వీట్ చేశాడు. ఇక దీని కింద ఉన్న కామెంట్లను పరిశీలిస్తే.. బన్నీ-మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైనట్టు తెలుస్తోంది. బన్నీ టీమ్ మొదట ఈ పోస్టర్లను రిలీజ్ చేసిందని మహేష్ ఫ్యాన్స్ అంటే.. తన సినిమా గురించి మాత్రమే మాట్లాడాడు.. మిగితా సినిమాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. మధ్యలో ఉండేవారు.. అసలింతకు వాటి అర్థమేంటని హరీష్ శంకర్‌ను అడుగుతున్నారు. మరి దాని గూఢార్థం ఆయనకే తెలియాలి.