Yes Boss భాగమతి డైరెక్టర్ దర్శకత్వంలో హవీష్.. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎస్ బాస్!
యువ హీరో హవీష్ కోనేరు హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పటికే చేరువయ్యారు. నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ చిత్రాల్లో ఆయన ఫెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విభిన్నమైన పాత్రలు, కథలను ఎంపిక చేసుకొంటూ వస్తున్న హవీష్ మరోసారి విలక్షణమైన రోల్‌తో ఎస్ బాస్ అంటూ ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. ఎస్ బాస్ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఏ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం Yes Boss. యువ హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌కు భాగమతి చిత్ర దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నది. ఈ చిత్రంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు.

దర్శకుడు అశోక్ భాగమతి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుంచి మొదలు కాబోతోంది. రవితేజ ఖిలాడి సినిమా తర్వాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే డీజే టిల్లు కెమెరామెన్ సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











