twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెస్టారెంట్లు, బార్లు తెరుస్తారు.. సినిమాలు మూసేస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలపై నాని ఫైర్

    |

    తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ ల గురించి హీరో నాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నిన్న సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే.

    Recommended Video

    Actor Nani Support To Doctors In Daare Leda Interview ​| Filmibeat Telugu
    తిమ్మరుసు ఈవెంట్

    తిమ్మరుసు ఈవెంట్

    తెలుగులో విభిన్నమైన సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరన్ తెరకెక్కించిన సినిమా తిమ్మరుసు.. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా బ్రహ్మాజీ అలాగే ఇతర ముఖ్య పాత్రధారులు నటించిన ఈ సినిమా థియేటర్లలో 30వ తేదీ జూలై నెలలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాత మహేష్ కోనేరు ఎన్టీఆర్ కి గతంలో పిఆర్ఓ గా పనిచేసిన క్రమంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమాకు క్రేజ్ లభించింది.

    నాని ముఖ్యఅతిధిగా

    నాని ముఖ్యఅతిధిగా

    ఇక ఈ సినిమా మీద మరింత క్రేజ్ లభించేలా చేయడం కోసం హీరో నానిని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నాని సినిమా థియేటర్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మన సంప్రదాయం అని చెప్పిన ఆయన థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది మన బ్లడ్ లోనే ఉందని చెప్పుకొచ్చారు.

    MAA Electionsలో మరో ట్విస్ట్.. కృష్ణంరాజుకు 15 మంది లేఖ, ప్రకాష్ రాజ్ తో హేమ భేటీ?

    థియేటర్ కి వెళ్ళిన వారు సేఫ్

    థియేటర్ కి వెళ్ళిన వారు సేఫ్

    పబ్బులకు రెస్టారెంట్లకు వెళ్లి మాస్కులు తీసి ఎంజాయ్ చేసే వాళ్ళ కంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూసే వాళ్ళు సురక్షితం అని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం ముఖ్యమేనని చెప్పుకొచ్చిన ఆయన దాదాపు అందరూ పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లకు వెళ్లి ఆ తర్వాత మాస్కులు తీసేసి దగ్గరగా ఉండి మాట్లాడుకుంటున్నారని దానికంటే దియేటర్లలో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా కూర్చున్న ప్రేక్షకులు చాలా సురక్షితం అని చెప్పుకొచ్చారు.

    అందరికీ చిన్న చూపే

    అందరికీ చిన్న చూపే

    అయితే ప్రభుత్వానికి ఈ సినిమా వాళ్ళ అంటే చిన్న చూపు అని అందుకే ధియేటర్లు అన్నిటికంటే ముందు మూసి కరోనా వెళ్లి పోయాక కూడా చివరిగా ఓపెన్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. తమ దగ్గర నుంచి ఆదాయం వస్తున్నా సరిగా పట్టించుకోవడం లేదు అన్నట్లు మాట్లాడిన ఆయన పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్ల వ్యవస్థ నాశనం అవుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు.

    Ippudu Kaaka Inkeppudu Trailer : రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ పిచ్చెక్కిస్తున్న రొమాన్స్ సీన్స్Ippudu Kaaka Inkeppudu Trailer : రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ పిచ్చెక్కిస్తున్న రొమాన్స్ సీన్స్

    మామీదే ఆంక్షలు

    మామీదే ఆంక్షలు

    ఇల్లు తర్వాత మనం సినిమా థియేటర్లలోనే ఎక్కువ సమయం గడుపుతామని పేర్కొన్న ఆయన నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి పోతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నా పట్టించుకోరు కానీ ఇలాంటి విషయాల్లో ఎవరూ మాట్లాడరని కానీ సినిమాల మీద ఎక్కువ ఆంక్షలు విధిస్తూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.

    మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో సినిమా నిర్మించిన ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదన్న ఆయన ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ ని దూరం చేసుకోకూడదని అందరం కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో ఓపెన్ అవుతున్న ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

    English summary
    Natural star Nani has become a hot topic in the industry, becoming a casual spectator and expressing his innermost feelings on Theaters opening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X