For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Electionsలో మరో ట్విస్ట్.. కృష్ణంరాజుకు 15 మంది లేఖ, ప్రకాష్ రాజ్ తో హేమ భేటీ?

  |

  అనేక మలుపులు తిరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. తాజాగా 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కృష్ణం రాజుకు లేఖ రాశారు. మరో పక్క హేమ-ప్రకాష్ రాజ్ ఇద్దరూ భేటీ అయ్యారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
  హాట్ టాపిక్ గా

  హాట్ టాపిక్ గా

  నిజానికి ప్రస్తుత మా పాలకవర్గం పదవీకాలం సెప్టెంబర్ 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రకాష్ రాజ్ ఈ సారి ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు అంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ప్రతి సారి ఇద్దరు మాత్రమే పోటీ పడే ఈ ఎన్నికల్లో ఈసారి ఏకంగా ఐదుగురు అభ్యర్థులు పోటీలో దిగుతూ ఉండడం మా ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చాయి అని చెప్పడంలో సందేహం లేదు.

  ప్రకాష్ రాజ్ లైన్ లోకి రావడంతో

  ప్రకాష్ రాజ్ లైన్ లోకి రావడంతో

  నిజానికి మునుపెన్నడూ లేని విధంగా మా ఎన్నికల కూడా సాధారణ రాజకీయ ఎన్నికల్లో పోటాపోటీగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అంటూ ప్రకాష్ రాజ్ ఏప్రిల్ నెలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశారు. ఈ లేఖ వ్యవహారం చాలా ఆలస్యంగా జూన్ నెల ఆఖరి లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి దీనికి సంబంధించి అనేక చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన ఫైనల్ ప్రకటించడమే కాక తాను బరిలోకి దిగుతున్న అంటూ ప్రకటించారు.

  హీరోగా వెంకటేష్ కొడుకు ఎంట్రీ.. మేటర్ లీక్ చేసిన పర్సనల్ మేకప్ మ్యాన్!

  నరేష్ కూడా వెంటనే

  నరేష్ కూడా వెంటనే

  ఆ వెంటనే ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ప్రకాష్ రాజ్ ఇలా అల్లరి చేయడం కరెక్ట్ కాదని ఆయన తమకు లేఖ రాసిన వెంటనే ఎన్నికలు నిర్వహించే విషయం మీద తాము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణా సంఘం బాధ్యులుగా ఉన్న కృష్ణంరాజు కు లేఖ రాశామని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఈ వ్యవహారం కాస్త మరుగున పడినట్టు అనిపించింది.

  మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. ఇలా మునుపెన్నడయినా చూశారా?

  అందుకే లేఖ రాశాం..

  అందుకే లేఖ రాశాం..

  అయితే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఉన్న 15 మంది సభ్యులు మా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. 2019లో ఎన్నికైన 15 మంది సభ్యులు తమ పదవీకాలం ముగిసి పోయింది కనుక వెంటనే మా ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కృష్ణంరాజు లేఖలలో కోరారు. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున లేఖ రాసినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు కాబట్టి లేఖ రాశామని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి రేపు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

  హేమ-ప్రకాష్ రాజ్ భేటీ

  హేమ-ప్రకాష్ రాజ్ భేటీ

  అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటించిన ప్రకాష్ రాజ్ అలాగే హేమ ఇద్దరూ నిన్న భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది భేటీ కాదని నిన్న కృష్ణవంశీ పుట్టినరోజు కావడంతో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా వీరిద్దరూ కలిశారని అంటున్నారు.

  ఇక ఇందులో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎలాంటి చర్చ ఈ వేడుకల్లో జరగలేదని తెలుస్తోంది. ఇక హేమ ప్రకాష్ రాజ్, కృష్ణ వంశీ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తం మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం మళ్లీ వేడి రేకెత్తిస్తోంది అనడంలో సందేహం లేదు.

  English summary
  The Movie Artists Association (MAA) election has kept the film industry in news. The majority members urged the Disciplinary Committee chairman to take a call on the elections and schedule them as early as possible.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X