రెండు సినిమాలకు రెండు కార్లు.. భీష్మ దర్శకుడికి నితిన్ రేంజ్ రోవర్ గిఫ్ట్
ఈ మధ్య కాలంలో దర్శకుల పనితీరు నచ్చితే హీరోలు, నిర్మాతలు కాస్ట్లీ బహుమతులు ఇచ్చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ గతంలో వారికి ఇష్టమైన వారికి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇక వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న నితిన్ కూడా తనకు మంచి బాక్సాఫీస్ హిట్టిచ్చిన దర్శకుడికి కాస్ట్లీ కారుని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఆ దర్శకుడు గతంలోనే అదే తరహాలో బహుమానాన్ని అందుకున్నాడు.

హిట్టిచ్చినందుకు రేంజ్ రోవర్
ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు. భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా నితిన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. మొత్తానికి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు పుట్టినరోజు సందర్భంగా నితిన్ దర్శకుడికి రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు.

మొదటి సినిమాకు కూడా..
త్రివిక్రమ్ దగ్గర పని చేసిన వెంకీ మొదట నాగ శౌర్యతో ఛలో సినిమా చేశాడు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అయితే అప్పుడే నాగ శౌర్య అతనికి ఒక కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇక ఇప్పుడు నితిన్ అంతకంటే విలువైన కారుని ఇచ్చాడు.

కారు వల్ల మనస్పర్థలు
దర్శకుడు వెంకీ కుడుములపై అప్పట్లో నాగ శౌర్య కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కారును బహుమతిగా ఇస్తే వాడకుండా పక్కన పడేశాడాని అది చాలా అవమానంగా అనిపించిందని అలాగే ఇద్దరికి మనస్పర్థలు వచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. నాగ శౌర్య ఎన్ని కామెంట్స్ చేసినా కూడా వెంకీ ఆ వివాదంపై పెద్దగా స్పందించలేదు.

మొత్తానికి సక్సెస్ రావడంతో..
ఇక వెంకీ రెండవ సినిమా భీష్మ నితిన్ కి మంచి సక్సెస్ ని అందించింది. అంతకుముందు నితిన్ వరుస అపజయలతో ఊహించని డిజాస్టర్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక భీష్మతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని వెంకీతో దాదాపు ఏడెనిమిది నెలలు కథపై చర్చలు జరిపాడు. మొత్తానికి సక్సెస్ రావడంతో మంచి రెమ్యునరేషన్ అందుకోవడమే కాకుండా పుట్టినరోజు సందర్భంగా ఒక కారును కూడా బహుమతిగా పొందాడు.
Recommended Video

వెంకీ..నెక్స్ట్ ఎవరితో?
ఈ విధంగా రెండు సినిమాలకు రెండు కార్లను అందుకున్న వెంకీ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా అయితే మెగా ఈ దర్శకుడు మెగా కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కి అలాగే పవన్ కళ్యాణ్ కి కథలు చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











