OG:‘ఓజీ’నిర్మాతకు ఉహించని షాక్.. ఆందోళనలో ఫ్యాన్స్!

టాలీవుడ్ లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీ ఓజీ (OG) మేనియా. సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య విడుదలైన ఓజీ పాజిటివ్ టాక్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ సుజీత్ కెరీర్ లోనే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలువబోతుంది. అంత బాగానే ఉన్నా 'ఓజీ'నిర్మాతకు ఉహించని షాక్ తగిలింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ ఓజీ . ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్, విలన్‌గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫీ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చరారు. ఈ మూవీని దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

High Court Stays OG Ticket Hike in Telangana Ruling Extended Until October 9

ఓజీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దీంతో ఓజీ సినిమా మొదటి రోజే సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి, పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డు క్రియేట్ చేసింది. రెండవ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో, తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల షేర్ వసూలు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ ముగిసే వరకు రూ.300 కోట్ల గ్రాస్ వసూలు దిశగా సినిమా ముందుకు సాగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఓజీ సినిమా విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చి మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మెమో ప్రకారం, సినిమా రిలీజ్ తర్వాత 10 రోజుల పాటు థియేటర్ స్థాయిని బట్టి 100 నుండి 150 రూపాయల వరకు టికెట్ రేట్లను పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే సామాన్యులపై అదనపు భారం మోపుతున్నారంటూ మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం, ఇష్టమొచ్చిన రేట్లకు టికెట్లు విక్రయించడం ద్వారా ప్రేక్షకులను దోపిడి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఈ తరుణంలో OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. టికెట్ల రేట్ల పెంపు వద్దంటూ గవర్నమెంట్‌ మెమోని సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అసలు తమ వెర్షన్ వినకుండా తీర్పు ఎలా ఇస్తారని డివిజన్ బెంచ్‌కి ముందు అప్పీలుకు వెళ్లింది మూవీ యూనిట్. మూవీ మేకర్స్ వెర్షన్ కూడా వినాలని డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్‌కి రిఫర్ చేసింది. అయినా ఇవాళ కూడా అదే తీర్పుని కొనసాగించారు జడ్జి. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాలు, అభిమానులు హైకోర్టు తీర్పుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ద్వారా ప్రేక్షకులు గందరగోళానికి లోనవ్వాల్సిన అవసరం లేదని, పెంచిన టికెట్ రేట్లు రద్దు కాదని మేకర్స్ స్పష్టం చేశారు. మొత్తం మీద హైకోర్టు స్టే ఆర్డర్ నిర్మాతలకు ఒక షాక్ అయినప్పటికీ, ఓజీ ఫీవర్ ఎక్కడా తగ్గలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X