For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓటిటి వరల్డ్ లో వాటన్నిటినీ బీట్ చేసిన హాట్ స్టార్.. నెట్ ఫ్లిక్స్ ను కూడా వెనక్కి నెట్టేసి..

  |

  ఏడాదిన్నర క్రితం నుండి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రారంభంలో మన దేశంలో కూడా కరోనా కేసులు రావడం వలన ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. అంతే కాకుండా కొన్ని పరిశ్రమలపై కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలపై కోలుకోలేని విధంగా దెబ్బ పడింది. పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారడంతో కొన్ని సినిమాలు థియేట్రికల్ బిజినెస్ కు నోచుకోలేక ఓటీటీ డీల్స్ కు తలవంచక తప్పలేదు. మార్చి లో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలు అందరినీ ఇంటికే పరిమితం చేసింది.

  అయితే లాక్ డౌన్ టైములో అన్ని రంగాలు కూడా మూతబడడంతో ఎక్కడి ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గరే ఉండి పోయారు. దానితో అందరి దృష్టి ఎంటర్టైన్మెంట్ సాధనాల పై పడింది. ఆ సయమంలో కొన్ని కోట్ల యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వెలిసాయి. అయితే సరిగ్గా అదే సమయంలో ఒటిటి ప్లాట్ ఫామ్స్ వారు పలు సినిమాలను కొనుగోలు చేయడం, మెల్లగా పలు చిన్న సినిమాలు, ఆ తరువాత కొన్ని పెద్ద సినిమాలు ఇలా వరుసగా కొనుగోలు చేస్తుండడంతో ఎక్కువమంది వీక్షకుల అవి చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

  ఆపై ఓటిటి రంగం విపరీతంగా పుంజుకుంది. ఆ తరువాత కొన్ని సరికొత్త ఓటిటి యాప్స్ కూడా వచ్చాయి. ఇక ఇటీవల ఈ ఏడాదిన్నరగా ఓటిటి లో విడుదలైన అనేక సినిమాలు ప్రజాదరణ పొంది మంచి రేటింగ్స్, క్రేజ్ ని దక్కించుకున్నాయి.ఇక ఇప్పటికీ కూడా మెల్లగా పలు కొత్త సంస్థలు ఈ రంగం వైపు అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు మన దేశంలో డిస్నీ హాట్ స్టార్ యాప్ ని అధికంగా వినియోగిస్తున్నారని, కాగా వీరికి ప్రస్తుతం మన దేశంలో 2.5 కోట్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారని సమాచారం.

  Hotstar beats all record in all india OTT platforms

  నిజానికి డిస్నీ వారు ఇటీవల కాలంలో విరివిగా పలు ప్రోగ్రామ్స్ తో పాటు క్రికెట్, వెబ్ సిరీస్ వంటివి ప్రసారం చేయడంతో విశేషంగా యువత దీనిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారని అర్ధమయ్యింది. అలానే తరువాత రెండవ స్థానంలో 1.7 కోట్ల సబ్ స్క్రైబర్స్ తో అమెజాన్ ప్రైమ్ నిలిచిందని తెలుస్తోంది.
  ఆ తరువాత మూడవ స్థానంలో సోనీ లైవ్ 70 లక్షల సబ్ స్క్రైబర్స్ ని పొందగా, ఆపై నాలుగవ స్థానంలో ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ 46 లక్షలు, ఆపై చివరిగా ఐదవ స్థానంలో 40 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తో జీ 5 ఐదవ స్థానంలో నిలిచిందట.

  అయితే మన తెలుగులో ఇటీవల వచ్చిన అల్లు అరవింద్ స్థాపించిన ఆహా, అలానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్థాపించిన స్పార్క్ వంటి ఓటిటి యాప్స్ కి కూడా మెల్లగా ప్రజలు ఆకర్షితులవుతున్నారని అంటున్నారు. మొత్తంగా దీనిని బట్టి రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఒటిటి ప్లాట్ ఫామ్స్ అనేవి భారీ స్థాయిలో క్రేజ్ దక్కించుకునే ఛాన్స్ ఒక క్లారిటీ అయితే వస్తోంది.

  English summary
  Hotstar beats all record in all india OTT platform's..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X