Texas School Shooting.. గుండె ముక్కలైంది.. భావోద్వేగమైన ట్వీట్‌తో ఆదర్శ్ బాలకృష్ణ

అమెరికాలోని ఓ స్కూల్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. టీనేజ్ యువకుడు గన్ పట్టుకొని టెక్సాస్‌లోని ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరిని గుండెకోతకు గురిచేసింది. దాదాపు 19 మంది చిన్నారులను, ఇద్దరు వ్యక్తులను ఉన్మాది పొట్టనపెట్టుకొన్నాడు. ఉన్మాది మెక్సికో సరిహద్దు నుంచి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. తాజా కాల్పుల ఘటన అమెరికాలో తుపాకీ సంస్కతి ఏ రేంజ్‌లో ఉందనే విషయం ప్రస్తుతం భారీ చర్చకు దారి తీసింది.

టెక్సాస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కాల్పుల ఘటనకు చరమగీతం పలకాల్సిన అవసరం ఏర్పడింది అంటూ ప్రకటన చేశాడు. అయితే ఈ రాక్షస ఘటనపై ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్, నటుడు ఆదర్శ్ బాలకృష్ణ స్పందించారు.

https://telugu.mykhel.com/cricket/ravichandran-ashwin-says-former-india-coach-duncan-fletcher-s-advice-has-been-very-helpful-in-his-gr-041739.html

అమెరికాలో నా సోదరి ఉంటుంది. ఏదో ఒక రోజు వాళ్లకు పిల్లలు ఉంటారు. వాళ్లు స్కూల్ వెళ్లడం తప్పనిసరి. అలా స్కూల్ వెళ్లే పిల్లలు ఇంటి నుంచి తిరిగి వస్తారా? అనే భయం ఇప్పుడు వారికి పట్టుకొన్నది. ఇలాంటి బేసిక్ ప్రశ్న అమెరికా వాసుల్లో ప్రస్తుతం నెలకొన్నది. శాంతి భద్రతలు అనేవి అమెరికాకు రాకెట్ సైన్స్ కాదు. త్వరగా రక్షణ చర్యలు తీసుకొని సాధారణ ప్రజలకు భరోసా కల్పించాలి అని ఆదర్శ్ బాలకృష్ణ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.

ఆదర్శ్ బాలకృష్ణ విషయానికి వస్తే.. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నారు. రకరకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో ఆదర్శ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X