అందుకే హరిహర వీరమల్లు నుంచి తప్పుకొన్నా.. పేలడానికి సిద్దంగా అంటూ క్రిష్
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఎందుకు తప్పుకొన్నాననే విషయంపై క్లారిటీ ఇస్తూ..

హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను కొన్ని కారణాల వల్ల నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పూర్తయింది. అయితే ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంపై అనేక రకాల ఊహాగానాలు మీడియాలో వినిపించాయి. అయితే ఆ ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా క్లారిటీ ఇస్తూ.. ప్రతీ సినిమా ఓ జర్నీ లాంటింది అని క్రిష్ అన్నారు.
పవన్ కల్యాణ్ గారంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం. నిర్మాత ఏఎం రత్నం బ్యానర్ సూర్య మూవీస్ పోస్టర్ చూసి సినిమాల్లోకి రావాలనే స్పూర్తి కలిగింది. ఆ కారణంతో హరిహర వీరమల్లు సినిమాను మొదలుపెట్టాం. అయితే మేము సినిమా ప్రారంభించిన తర్వాత కోవిడ్ కారణంగా షూటింగ్ జాప్యం అయింది. దాంతో షెడ్యూలింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో ఘాటీ సినిమాను ప్రారంభించే విషయంలో నేను ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను అని క్రిష్ వివరణ ఇచ్చారు.
హరిహర వీరమల్లు సినిమా కొంత భాగం నేనే చిత్రీకరించాను. ఘాటీ మూవీ, ఇతర వ్యక్తిక్తిగత కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ సినిమా ప్రయాణం తన వరకూ పూర్తయింది. ఆ తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాను పూర్తి చేశారు. అనంతరం ఘాటి సినిమాపైనే పూర్తిగా దృష్టి సారించాను. అంతకు మించి వేరే కారణాలు ఏవీ లేవు అని క్రిష్ తెలిపారు.
ఘాటీ సినిమా నాకు ఎంతో ప్రత్యేకైనది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చెన్నైలో ఈ సినిమా తమిళ్ ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా పేలడానికి సిద్దంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంటుంది. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఘాటీ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. మీకు కొత్త అనుభూతిని పంచుతుంది అని మీడియాతో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











