Don't Miss!
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పూనమ్ కౌర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. వ్యక్తి అరెస్ట్‌కు రంగం సిద్ధం
Recommended Video
సినీ తారలను, సెలబ్రిటీలను, రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో వేధిస్తున్న అకతాయిలపై సైబర్ పోలీసులు కన్నుపెట్టారు. పలువురు సెలబ్రిటీల ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలపై గురిపెట్టారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులు చేస్తున్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల, లక్ష్మీపార్వతి, సినీతార పూనం కౌర్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టడం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై దుప్ఫ్రచారం చేస్తున్న వారిపై దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఇటీవల లక్ష్మీపార్వతి, పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులను పెడుతున్నది ఒకరే అని గుర్తించారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ను అడ్డాగా చేసుకొని ఈ దందాకు పూనుకొన్నట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక ఏదైనా చెడు కోణం ఉందా? రాజకీయ కారణాలు ఉన్నాయా? వారి ఉద్దేశం ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇక లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌పై చేస్తున్న దుష్రచారం ఒకే ఐపీ అడ్రస్ నుంచి రావడంతో ఆ ఇద్దరిని టార్గెట్ చేసింది ఒకే ప్లేస్ నుంచి అని గుర్తించారు. ఈ కుట్ర వెనుక ఒక్కరే ఉన్నారా? లేక ఏదైనా గ్రూప్ ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రముఖులపై సైబర్ దాడి చేస్తున్న వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొబైల్ ఫోన్లను ట్రాక్ చేస్తున్నట్టు తెలిసింది.
గత ఎనిమిది నెలల నుంచి పూనం కౌర్‌ను వేధిస్తున్నట్టు ఫిర్యాదు అందింది. ఇక లక్ష్మీపార్వతిని ఫిబ్రవరి నుంచి టార్గెట్ చేశారనే కంప్లయిట్ పోలీసులకు చేరింది. వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం నేపథ్యంలో లక్ష్మీ పార్వతిపై పోస్టులు పెరిగాయని, పవన్ కల్యాణ్‌ను విమర్శించిన నేపథ్యంలో పూనం కౌర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెరిగాయనేది తెలిసిందే.