మీసం తిప్పి చెబుతున్నా.. అనిరుధ్‌కు OGతో ఎస్ఎస్ థమన్ ఛాలెంజ్.. ఏంటంటే?

ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టార్ ఫిలిం OG కావడం విశేషం. OG చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఎస్ ఎస్ తమన్ ఎన్నో బ్లాక్ బాస్టర్ చార్ట్స్ ను ప్రేక్షకులకు అందించారు. చాలా సినిమాలకు ఆయన సంగీతమే సగ బలమైన నడిపించింది. ఇక స్టార్ హీరోలకు ఏ తరహాలో మ్యూజిక్ వాయించాలో పట్టున్న సంగీత దర్శకుడు కావడం విశేషం.

ఈ క్రమంలో కొన్నాళ్లుగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ నుంచి సాలిడ్ మ్యూజిక్ రావడం లేదు అంటూ ఆయన అభిమానులు, సంగీత ప్రియులు అంటున్నారు. కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ చిత్రం ద్వారా ఎస్ ఎస్ తమన్ సమాధానం ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన సంగీతం వేరు, ఈ ఒక్క సినిమా వేరు అంటూ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ గురించి కూడా మాట్లాడారు.

India s Top Music Director SS Thaman threw down Interesting Challenge with OG Movie

ఎస్ ఎస్ తమన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ OG చిత్రంతో నేను ఏంటో చూపిస్తాను. మన మ్యూజిక్ ఏంటో తమిళ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే సమయం వచ్చింది. ఇటీవల కాలంలో తమిళ ఇండస్ట్రీలో గ్యాంగ్ స్టార్ సినిమాల ద్వారా బాగా సౌండ్ చేసిన మూడు చిత్రాలకు ఓజీ సమాధానం అవుతుంది. ఇక ఇప్పుడు మన హీరో గ్యాంగ్ స్టార్ ఫిలిం చేస్తే దానికి నేను అందించిన మ్యూజిక్ ఎలా ఉంటుందనేది వాళ్లకు కూడా తెలుస్తుంది.

విక్రమ్, జైలర్, లియో, బీస్ట్ వంటి చిత్రాలకు పవన్ కళ్యాణ్ OG చిత్రం సమాధానం అవుతుంది. గ్యాంగ్ స్టార్ చిత్రాలకు మన నుంచి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు తమిళ ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. మన తెలుగు పరిశ్రమలో కూడా హీరోలు గ్యాంగ్ స్టార్ వంటి చిత్రాలకు ఓకే చెబితే కనుక బిజిఎం, సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయనిది ఇతర భాషలోని ఆడియన్స్ కు కూడా తెలుస్తుంది. నేను మీసం తిప్పి చెప్పుకుంటా ఆ తమిళ చిత్రాలకు ఓజీ సమాధానంగా ఉంటుందని,. ఇక ఓజీ అనే చిత్రం నెవర్ బిఫోర్ ఫిల్మ్ గా ఉండబోతోంది.

ఓజి చిత్రంలో 6 నుంచి 7 పాటలు ఉన్నాయి. ముఖ్యంగా OG చిత్రం ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విషయంలో ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంతో శ్రద్ధ వహించి ఈ చిత్రానికి ట్యూన్స్ కట్టాము. ఓజీ చిత్రం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫీలింగ్ గా ఉండబోతుందని ఆశిస్తున్నాను... అంటూ ఎస్ఎస్ తమన్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే ఓజీ చిత్రం నుంచి తమను అందించిన గ్లిమ్స్, బిజిఎం కూడా విడుదలై సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X