కాజల్ అగర్వాల్‌కు బంపర్ ఆఫర్.. బ్లాక్‌బస్టర్ మూవీ బాలీవుడ్ రీమేక్‌లో!
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో భారీ ఆఫర్లను సొంతం చేసుకొంటున్న కాజల్ అగర్వాల్‌కు మరో బంపర్ ఆఫర్ లభించినట్టు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లను చేజిక్కించుకొంటున్న ఈ భామ తమిళంలో ఘన విజయం సాధించి బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న చిత్రంలో హీరోయిన్ రోల్‌ను సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఆ రీమేక్ చిత్రం ఏమిటంటే...
దర్శకుడు లోకేష్ కనకరాజ్ కెరీర్‌లోనే కాకుండా కార్తీ సినీ జీవితంలో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ఖైదీ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గానీ, పాటలు లేకుండానే తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా చేసింది. అయితే ఆ సినిమా ఇప్పుడు అజయ్ దేవగణ్ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు.

అయితే బాలీవుడ్ నేటివిటికి అనుగుణంగా ఖైదీ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కథలోకి దూసుకొచ్చిన హీరోయిన్ రోల్‌ను కాజల్ అగర్వాల్ సొంతం చేసుకొన్నట్టు ప్రాథమిక సమాచారం. ముంబైలో కర్ఫ్యూ ఎత్తి వేసిన తర్వాత ఈ సినిమా షూటింగును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.
కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన ముంబై సాగా అనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఇండియన్2 చిత్రంలో కమల్‌తో జతకట్టారు. హే సినామికా, ఘోస్ట్‌లీ కబ్జా, ఆచార్య, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జునతో ఓ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











