twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీ ఒక్కరినీ ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు.. సైరా డైరెక్టర్‌పై జగపతి బాబు కామెంట్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్బంగా సైరా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

    ఈ వేదికపై జగపతి బాబు మాట్లాడుతూ.. ''నాన్నకు ప్రేమతో అంటే మా చరణ్. డబ్బులు విరజిమ్మి మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలని ఆయన తీసిన సైరా. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తోంది. అన్ని భాషల్లో ఇంత పెద్ద సూపర్ హిట్ కావడం రామ్ చరణ్ తోనే ప్రారంభమైంది'' అని అన్నారు జగపతి బాబు.

    Jagapati Babu Comments On Sye Raa Narasimhaa Reddy Director

    ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి చిరంజీవికి బర్డెన్ ఎక్కువగా ఉంటుందని భావించి తాను చాలా దూరంగా ఉండేవాడినని జగపతి బాబు అన్నారు. కానీ చాలా కూల్‌గా ఆయనే వచ్చి అందరినీ పలకరించే వారని చెప్పారు. పరుచూరి బ్రదర్స్ కన్న కల ఇలా నిజమైందని అన్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా కూల్ అని, ప్రతీ ఒక్కరినీ ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారని అన్నారు జగపతి బాబు. సైరా నరసింహా రెడ్డి ఈ రోజు ఇంత పెద్ద సినిమా కావడానికి వెనుక చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడిందని ఆయన పేర్కొన్నారు.

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. Today Movie Unit celebrate Thank You meet. In this event Jagapati Babu says about Sye Raa Narasimhaa Reddy unit and Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X