Don't Miss!
- Automobiles
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- News
కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కామెడీతో కిక్కిచ్చిన జాతిరత్నాలు ట్రైలర్.. బ్రహ్మీ రీ ఎంట్రీ కెవ్వు కేక!
ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం జాతిరత్నాలు పేరు మారు మారుమ్రోగిపోతోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎదో సంచలనం క్రియేట్ చేసేలా ఉందని గత కొన్ని రోజులుగా వస్తున్న బజ్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇక ట్రైలర్ తోనే చిత్ర యూనిట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మార్చ్ 11న రానున్న ఈ సినిమాకు ప్రభాస్ కూడా తనవంతు ప్రమోషన్ చేశాడు.

నవ్విస్తున్న ట్రైలర్
జాతి రత్నాలు అనే టైటిల్ తోనే కామెడీ టచ్ ఇచ్చిన దర్శకుడు ఇక సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లను డంబ్ క్యారెక్టర్స్ గా ప్రజెంట్ చేసినట్లుగా అర్ధమవుతోంది. ముగ్గురు స్నేహితులు అనుకోకుండా ఒక దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, ఆ తరువాత ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే పాయింట్ తోనే కథను నడిపించారు అనిపిస్తోంది.

బ్రహ్మానందం రీ ఎంట్రీ
ఇక సినిమాలో హీరోయిన్ మరో మేజర్ ప్లస్ పాయింట్ అనిపిస్తోంది. చాలా క్యూట్ గా ఉంది. నవీన్ తో ఆమె లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా ఎదో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. ఇక ట్రైలర్ చివరలో బ్రహ్మానందం కూడా సరికొత్తగా అకట్టుకోవడం మరో హైలెట్ పాయింట్.

నాగ్ అశ్విన్ నిర్మాతగా
జాతిరత్నాలు హవా ఇప్పుడు మామూలుగా లేదు. దానికి తోడు కామెడీ గానే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సినిమాను వైజయంతి వారి స్వప్నా సినిమాస్ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ సినిమాకు దర్శకత్వం వహించగా రాధన్ మ్యూజిక్ అంధించాడు. ఇప్పటికే చిట్టి అనే సాంగ్ యూ ట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇక టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్
జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ ను కలిసి జాతిరత్నాలు సినిమా గురించి వివరించాడట.