Kantara Chapter 1: మా అమ్మమ్మ చెప్పిన కథే కాంతారా.. అంచనాలు పెంచిన ఎన్టీఆర్
'కాంతార'సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఓ సౌత్ ఇండియా సినిమా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ప్రిక్వెల్ గా 'కాంతార: ఏ లెజెండ్' అనే సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న 'కాంతారా 1'సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబడింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
భారీ బడ్జెట్ , అంతకు మించిన అంచనాలతో తెరకెక్కిన 'కాంతార 1 సినిమాను హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి కథానాయకుడే కాకుండా దర్శకుడు కూడా. కథానాయికగా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా.. కీలక పాత్రలో దిల్షాన్ దేవయ్య కనిపిస్తున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ విడుదల అవ్వడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కన్నడలో సంచలనం సృష్టించిన కాంతారాకు ప్రీక్వెల్‌గా వచ్చే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

కాంతార 1 ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నాకు రెండు లేదా మూడు ఏళ్ళ వయసులో అమ్మమ్మ గులిగా ఆటలు, పింజుర్లీ కథలు చెప్పేది. ఆ కథలను ఎప్పటికైనా చూడాలన్న కోరిక. నేడు రిషబ్ శెట్టీ ద్వారా నా కల సాకారం అయ్యింది. వెండితెరపై చిన్ననాటి కథలు చూడటం ఎంతో ఎమోషనల్ అనిపించింది. కథ తెలిసిన తానే అంతలా ఎమోషన్ అయితే కొత్తగా విన్నవారు ఎలా ఫీలవుతారు మాటల్లో చెప్పలేం అంటూ కాంతారా సినిమా డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి లో డైరెక్టర్ యాక్టర్ మాత్రమే కాదు.. 24 డిపార్ట్మెంట్స్ పై అతనికి పట్టుందని అన్నారు.
మా అమ్మ కోరికను నెరవేర్చారు
అదే సమయంలో, ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యి, "రిషబ్ శెట్టీ వల్ల నా అమ్మ కోరిక నెరవేర్చబడింది. ఆ విషయంలో తాను రుణపడి ఉంటా. ఉడిపి వెళ్లినప్పుడు మమ్మల్నీ ఆయన కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఆ సమయంలో కాంతార సినిమా షూటింగ్ కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశాను. ఓ పురాతన దేవాలయానికి మార్గం లేకపోతే రోడ్డు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో కాంతారాకు ప్రత్యేక పేజీ ఉండాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో దర్శకుడు ప్రశాంత్ ని గుర్తు చేసుకున్నారు.
గత కొన్ని రోజుల క్రితం ఓ యాడ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే, ప్రమాదం తీవ్రతరంగా కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చారు. ఆ తరువాత ఎప్పటి లాగా ఎన్టీఆర్ పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. కానీ రిషబ్ శెట్టీతో కలిసి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజరై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందినవారు కావడంతో, కన్నడ పరిశ్రమతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో తన కుటుంబంతో కలిసి కర్ణాటక పర్యటనకు వెళ్లిన సమయంలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టీ ఫ్యామిలీని కలుసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో సంతోషాన్ని కలిగించింది.
మొత్తం చెప్పాలంటే, 'కాంతారా: ఏ లెజెండ్' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ హాజరైన సందర్భంలో విజయం సాధించడమే కాక, రిషబ్ శెట్టీ, తెలుగు-కన్నడ సినిమా పరిశ్రమల మధ్య స్నేహబంధాన్ని కూడా మరోసారి హైలైట్ చేసింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











