Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Thimmarusu Movie Trailer: ఎన్టీఆర్ విడుదల చేసిన ట్రైలర్.. సత్యదేవ్ మరో డిఫరెంట్ మూవీ!
ప్రయోగాత్మకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరో సత్యదేవ్ ఈసారి మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్నాడు. డిఫెన్స్ లాయర్ పాత్రలో తిమ్మారుసు అనే సినిమా చేస్తున్న సత్యదేవ్ ట్రైలర్ తోనే అంచనాల డోస్ పెంచేశాడు. ఇక ఆ ట్రైలర్లకు ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది.
తిమ్మారుసు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందిస్తూ ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సినిమా సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందినట్లు తెలుస్తోంది. ఇక బ్రహ్మాజీ లాంటి యాక్టర్ తో కామెడీని కూడా హైలెట్ చేసినట్లు అనిపిస్తోంది. డిఫెన్స్ లాయర్ రామచంద్రయ్య 8 ఏళ్ళ క్రితం జరిగిన ఒక మర్డర్ కేసుని ఎలా చేధించాడు అనేది అసలు కథ. ఇక కేసును చేదించే క్రమంలో రామచంద్ర ఎలాంటి పజిల్స్ ను సాల్వ్ చేశాడు, అలాగే అతను శత్రువుల నుంచి ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటనేది హైలెట్ గా ఉన్నాయి.
డైలాగ్స్ కూడా కథకు తగ్గట్లుగానే సాలీడ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. నువ్వు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే లైఫ్ లాంగ్ రీ సౌండ్ వస్తుంది.. అంటూ సత్యదేవ్, అజయ్ కు ఇచ్చే వార్నింగ్ హై వోల్టేజ్ యాక్షన్ ను తలపిస్తోంది. 'నేను దండేసి దండించే రాముడి లాంటోడిని' అనే డైలాగ్ కూడా బాగానే ఉంది. ఇక సినిమాలో ఫైట్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. కేసును చేదించే క్రమంలో లాయర్ పై కూడా ఎందుకు మర్డర్ అటెంప్ట్ జరిగిందనేది మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్.

మొత్తంగా ట్రైలర్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా బజ్ క్రియేట్ చేశారు. ఇక సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ కోనేరు, సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. ఇక ట్రైలర్ తో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా వెండితెరపై ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.