NTR Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. హైప్స్ పెంచిన స్టార్ ప్రొడ్యూసర్..
Jr NTR Dragon Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'డ్రాగన్'. ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌లో ఎక్కువ శాతం పూర్తయింది. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తన ఫిట్నెస్ లెవెల్స్‌ని చూపించి ఫ్యాన్స్‌కి క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ లూక్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ తరుణంలో డ్రాగన్ మూవీపై నిర్మాత రవిశంకర్ షాకింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఆయన మాటలు సోషల్ మీడియా వైరల్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇంతకీ ఏమన్నారంటే..?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా సినిమా "డ్రాగన్" రాబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో సినిమా ప్రకటించిన నాటి నుండి ఈ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన "కాంతార చాప్టర్ 1" గ్రాండ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. లీన్ బాడీతో పుల్ గడ్డం లుక్‌లో దర్శనమిచ్చారు. తారక్ స్టన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ సర్పైజ్ అయ్యారు. ఆ లూక్ చూస్తే.. ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ ఎలా కనిపించబోతున్నాడో క్లారిటీ వచ్చిందని అభిమానులకు. ఈ ఈవెంట్ కు మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామి, ప్రొడ్యూసర్ మైత్రి రవి కూడా హాజరయ్యారు.

డ్రాగన్ సినిమాపై హైప్స్
కాంతార 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ చాలా క్లోజ్‌గా ఉంటారు. కాబట్టి మా సినిమాపై ఒక అప్‌డేట్ చెప్పకుండా ఉండలేను. వచ్చే నెల నుంచి డ్రాగన్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఎలాంటి విరామం లేకుండా సినిమా పూర్తి అవుతుంది. ఇది మీ ఊహకన్నా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మేము మీకు ప్రామిస్ చేసినట్టు సినిమాను మీ ఆలోచనకు వదిలేసాం. అది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అంటూ ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ , సలార్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నెక్స్ట్ మంత్ లో డ్రాగన్ సినిమా షెడ్యూల్ బిగిన్ అవుతుంది. అన్ఇన్త్రప్టెడ్ గా సినిమా పూర్తి అవుతుందనే ప్రొడ్యూసర్ రవిశంకర్ మాటలు ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, డ్రాగన్ పాన్ ఇండియా హంగామాకు ముందస్తు రుచి చూపించాయి.
డ్రాగన్ కథ ఇదేనా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్, ప్రభాస్‌లతో మాదిరిగానే, ఇప్పుడు ఎన్టీఆర్‌తోనూ నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కథకు బంగ్లాదేశ్, చైనా దేశాలతోనూ కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలను రక్షించడానికి ఇండియా నుంచి వెళ్లే హీరో పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడట.
ఈ కథలో "డ్రాగన్" అనే పేరు జూనియర్ ఎన్టీఆర్ పాత్రను మరింత ఎలివేట్ చేయబోతోందని, వలసదారుల సమస్యల చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. ఇది పూర్తిగా పౌరాణిక డ్రామా కాకపోయినా, ఫిక్షనలైజ్డ్ హిస్టారికల్ ఎలిమెంట్స్, యాక్షన్ - ఎమోషన్ మేళవింపుతో తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతేకాకుండా, డ్రాగన్ అనే టైటిల్ చైనా సంస్కృతిలో కీలకమైనది కావడం వల్ల, అక్కడి ప్రేక్షకులకు కూడా ఈ టైటిల్ కనెక్ట్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











