రామ్ చరణ్ ఇంటి బయట ఎన్టీఆర్ లాంబోర్గిని.. అసలు కధ ఏంటంటే ?
ఖరీదైన కార్లను సేకరించడం మన హీరోలకు అలవాటే. టాలీవుడ్ హీరోలయిన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారు కోట్ల విలువైన లగ్జరీ కార్లు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లాంబోర్ఘినీ కారు కొన్నారని ప్రచారం జరుగుతూ ఉండగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు ఆయన పీఆర్వో.

చరణ్ ఇంటికి ఎన్టీఆర్
రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త లాంబోర్గినీ కారు కొని ఆ వెంటనే అదేసుకుని రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడని, చెబుతూ ప్రస్తుతం పార్క్ చేసిన ఉన్న ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అది నిజం కాదు
అయితే ఈ లాంబోర్గినీ కారు జూనియర్ ఎన్టీఆర్ ది కాదని జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వో మరియు ప్రముఖ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు స్పష్టం చేశారు. లంబోర్ఘిని జూనియర్ ఎన్టీఆర్ కు చెందినది అని ఒక వెబ్‌సైట్ చేసిన ట్వీట్‌పై స్పందించిన మహేష్ కొనేరు "అది నిజం కాదు" అన్నారు.

డబ్బు కట్టింది నిజమే కానీ
ఈ కారు జూనియర్ ఎన్టీఆర్ సొంతం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ఇంటి ముందు ఆపి ఉంచిన లంబోర్ఘిని కారు వేరొకరికి చెందినది. ఇక లాంబోర్ఘినీ యూరస్ కోసం ఎన్టీఆర్ టోకెన్ మొత్తాన్ని చెల్లించినది నిజమే. కానీ ఆ కారు డెలివరీ జరగాల్సి ఉంది.

డిమాండ్ ఎక్కువ కావడంతో
ఈ అత్యంత ఖరీదైన లాంబోర్ఘినీ యూరస్ అనే మోడల్ కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందట బుక్ చేశారు. అయితే ఆ కారుకు ఉన్న డిమాండ్ కారణంగా డెలివరీ లేట్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీగా ఉండే వాహనాలను కొనుగోలు చేస్తుంటాడు.
Recommended Video

లక్కీ నెంబర్
నిజానికి 5 కోట్ల విలువ చేసే ఇటాలియన్ లగ్జరీ లాంబోర్ఘినీ యూరస్ కారు కోసం తారక్ గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్నారు. ఇక అయన తన అన్ని కార్లు బైకులకు కూడా 9999 అనే నెంబర్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. అది ఆయనకు చాలా లక్కీ నెంబర్.


Click it and Unblock the Notifications











