Kantara Chapter 1 Pre Release Event: కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?
పాన్ ఇండియా స్థాయిలో కన్నడ సినిమా రేంజ్‌ని పెంచిన కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషభ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. గాంధీ జయంతి, విజయదశమి కానుకగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళీ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

తెలుగు నాట భారీ అంచనాలు
ఇక కాంతార సినిమాను కన్నడిగులతో సమానంగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ఏపీ, తెలంగాణలలో నాడు రిషభ్ శెట్టి సినిమాకు 58.60 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. దీంతో తాజాగా రిలీజ్ కానున్న కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ బాగా జరిగినట్లుగాద ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
హైదరాబాద్‌లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1పై ఉన్న ఈ హైప్‌ను పెంచేందుకు గాను మేకర్స్ వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా హైదరాబాద్‌లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరుకానున్నారు అనే దానిపై రకరకాల పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే దీనికి హోంబలే ఫిల్మ్స్ తెరదించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కాంతార చాప్టర్ 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రిషబ్ శెట్టికి, ఎన్టీఆర్‌కి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తల్లిది కర్ణాటకలోని కుందాపుర కాగా.. రిషబ్‌ది కూడా అదే ప్రాంతం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అంటే రిషభ్ శెట్టికి ఎంతో ఇష్టం. మొన్నామధ్య హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ కుటుంబం కర్ణాటకకు వెళ్లగా.. రిషబ్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











